Aadhya : సోషల్ మీడియా వచ్చిన తర్వాత సెలబ్రిటీస్ మాత్రమే కాదు , వాళ్ళ కూతుర్లు కొడుకులు కూడా సోషల్ మీడియా ని తెగ వాడేస్తున్నారు.కొంతమంది సెలెబ్రిటీల కిడ్స్ ప్రత్యక్షంగా సోషల్ మీడియా లో లేకపోయినా, తల్లితండ్రుల ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులను పలకరిస్తూనే ఉంటారు. అలాంటి వారి జాబితాలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ముందు వరుసలో ఉంటుంది.

తన కొడుకు అకిరా నందన్ మరియు కూతురు ఆద్య కి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా లో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ మురిసిపోతూ ఉంటుంది రేణు దేశాయ్.వీటికి పవన్ కళ్యాణ్ అభిమానుల నుండి లక్షల సంఖ్యలో లైక్స్ మరియు షేర్స్ వస్తుంటాయి.కాసేపటి క్రితమే ఆమె ఆద్య కి సంబంధించి పెట్టిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ గా మారిపోయింది.పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ వీడియో ని తమ సోషల్ మీడియా వాల్స్ పై షేర్ చేస్తూ తెగ సంబరపడిపోతున్నారు.

ఆ వీడియో లో ఆద్య గంగానదిలో దూకి స్నానం చేసిన వీడియో ని రేణు దేశాయ్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో అప్లోడ్ చేసింది.పాపం చలికి వణికిపోతున్న ఆద్య ని చూసి అభిమానులు కాస్త కంగారుకి గురయ్యారు.ఆ వీడియో ని మీరు కూడా క్రింద చూసేయొచ్చు.ఇది వరకు ఆద్య కి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ వచ్చిన రేణు దేశాయ్, అకిరా నందన్ కి సంబంధించిన వీడియోలు మరియు ఫోటోలను మాత్రం ఎక్కువగా చెయ్యదు, చాలా అరుదుగా అప్లోడ్ చేస్తూ ఉంటుంది.
ఒకసారి అకిరా నందన్ జిమ్ లో చేస్తున్న వర్కౌట్స్ మరియు కర్రసాము వంటివి ఆరోజుల్లో రేణు దేశాయ్ షేర్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేసింది, మళ్ళీ అలాంటి వీడియోస్ రేణు దేశాయ్ అప్లోడ్ చేస్తుందేమో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.