Bro Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘బ్రో ది అవతార్’ ఈ నెల 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంభందించిన టీజర్ మరియు పాటలను రీసెంట్ గానే విడుదల చెయ్యగా, టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది కానీ, పాటలకు మాత్రం మిశ్రమ స్పందన లభించింది. సినిమా విడుదలకు ఇక కేవలం 11 రోజుల సమయం మాత్రమే ఉంది.
అభిమానుల్లో ఈ చిత్రానికి కావాల్సిన హైప్ రావడం లేదని చాలా ఫీల్ అవుతున్నారు. దానికి కారణం ప్రొమోషన్స్ లేకపోవడం వల్లే. ఈపాటికి ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదల అవ్వాలి, కానీ అది జరగలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సినిమా విడుదలకు సరిగ్గా మూడు రోజుల ముందు,అనగా జులై 25 వ తారీఖున జరపబోతున్నారు.
ఇలా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ఇంత ఆలస్యం అవ్వడానికి కారణం ఏమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తే, పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత జరగాల్సిన వర్క్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడం వల్లే అని తెలుస్తుంది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ తన పాత్ర కి సంబంధించిన డబ్బింగ్ ని చెప్పలేదట. రాష్ట్ర వ్యాప్తంగా ‘వారాహి’ టూర్ లో బిజీ గా ఉండడం వల్ల ఆయన ఎప్పుడు సమయం చూసుకొని డబ్బింగ్ చెప్తాడో తెలియని పరిస్థితి.
మరో పక్క థమన్ రీ రికార్డింగ్ కి సంబంధించి చాలా వర్క్ పెండింగ్ లో ఉంది. ట్రైలర్ కట్ సిద్ధం గా ఉంది కానీ, దానికి డబ్బింగ్ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ ని పూర్తి చెయ్యలేదు. ఇంత వర్క్ పెండింగ్ లో పెట్టుకొని ఈ సినిమా 28 వ తారీఖున విడుదల అవ్వడం కష్టమే అని అంటున్నారు,చూడాలి మరి.