Akhira Nandan : మోక్షజ్ఞకు పోటీగా పవన్ కళ్యాణ్ కొడుకు సినీ ఎంట్రీ.. ఇప్పుడు కదా అసలు మజా..!

- Advertisement -

Akhira Nandan : రోజు రోజుకు సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు మారిపోతున్నాయి. కొత్త కొత్త ట్రెండ్ వెలుగులోకి వస్తుంది. నిన్న మొన్నటి వరకు స్టార్ గా ఉన్న వాళ్లు వయసు అయిపోవడంతో సీనియర్స్ అయిపోతున్నారు. ఇండస్ట్రీలోనూ తరాలు మారుతున్నాయి. ఇప్పుడు తండ్రులు పోయి కొడుకులు ఆ స్థానాన్ని అందుకునే స్థితికి వచ్చేస్తున్నారు. ఇండస్ట్రీలో పూర్తిగా లెక్కలు మారిపోతున్న పరిస్థితులను మనం చూస్తున్నాం. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ప్లేస్ లోకి ఆయన కొడుకు అకీరా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

నిన్న మొన్నటి వరకు అకీరానందన్ బయట పెద్దగా కనిపించేవాడు కాదు. అలాగే ఎవరితో పెద్దగా కలిసే వాడు కూడా కాదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన తన తండ్రి పవన్ కళ్యాణ్ విజయం తర్వాత అకీరానందన్ ఎక్కువగా మీడియాలో కనిపిస్తూ సందడి చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా తాను ఎక్కడికి వెళ్తే అక్కడికి కొడుకును వెంట తీసుకుని వెళ్తున్నాడు. కాగా ఇప్పుడు ఇదే విషయం గా మరొక స్టార్ హీరోకి తలనొప్పులు తెచ్చిపెడుతుంది.

- Advertisement -
Akhira Nandan
Akhira Nandan

త్వరలోనే బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఎప్పుడో మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. కానీ సెప్టెంబర్ 2025వ సంవత్సరంలో మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఇస్తే ఆయన కెరీర్ బాగుంటుంది అంటూ ఓ జ్యోతిష్కుడు చెప్పాడట. ఆ కారణంగానే బాలకృష్ణ ఇన్నాళ్లు ఆయన సినిమాను పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారట. అయితే ఇప్పుడు సరిగ్గా అదే సమయానికి పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ కూడా వెండితెరకు ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. దీంతో బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞకు పవన్ కళ్యాణ్ కొడుకు అకీరానందన్ కు మధ్య టఫ్ ఫైట్ ఉండబోతుందంటూ ఓ రేంజ్లో ప్రచారం జరుగుతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here