Anu Emmanuel : అను ఇమాన్యువెల్ కి పవన్ ఫ్యాన్స్ సపోర్ట్.. మీ రుణం తీర్చుకుంటామని మెసేజ్ లు..!

- Advertisement -

Anu Emmanuel : అను ఇమాన్యువెల్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. ఆమెకు పవర్ స్టార్ ఫ్యాన్స్ థాంక్య్ చెప్తున్నారు. ఇప్పుడు ఇదే న్యూస్ వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో అను ఇమాన్యువెల్ ను ట్రెండింగ్ చేస్తున్నారు పవన్ అభిమానులు, దానికి రీజన్ రీసెంట్ గా ఆమె నటించిన జపాన్ సినిమానే.అను తెలుగులో చాలా సినిమాల్లో నటించింది. కానీ పెద్దగా క్రేజ్ దక్కించుకోలేకపోయింది. హిట్లు కూడా అందుకోలేదు. పవన్ కల్యాణ్ తో కలిసి అజ్ఞాతవాసి మూవీలో నటించింది. ఈ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. కాగా రీసెంట్ గా ఆమె నటించిన మూవీ జపాన్. ఈ మూవీలో అను చేసిన పనికి పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. జపాన్ మూవీలో అను హీరోయిన్ క్యారెక్టర్ లో నటించింది. అందులోనే అజ్ఞాతవాసి పోస్టర్స్ కూడా చూపించారు. జపాన్ మూవీలో పవన్ రెఫరెన్స్ వచ్చినప్పుడల్లా ఫ్యాన్స్ టాప్ లేచేలా అరిచేస్తున్నారు. అంతేకాకుండా ఈ మూవీలో ఆమెను పవన్ పక్కన నటించే స్థాయికి ఎదిగిన హీరోయిన్ గా చూపించారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఊగిపోతున్నారు.

Anu Emmanuel
Anu Emmanuel

తెలుగు,తమిళంలో స్టార్స్ తో పనిచేసినప్పటికీ ఆమెకు పెద్దగా కలిసివచ్చినట్లు కనిపించదు. అను ఇమ్మాన్యుయేల్ కెరీర్‌లో, చాలా సినిమాలు ఫెయిల్యూర్స్, హిట్ లేదా పెద్ద బ్లాక్‌బస్టర్‌లు దాదాపు లేవనే చెప్పాలి. ఆమె తొలి చిత్రం నానితో చేసిన మజ్ను..జస్ట్ ఓకే అనిపించుకుంది. ఆ తర్వాత వరస పెట్టి డిజాస్టర్స్ వచ్చాయి. కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఆక్సిజన్, అజ్ఞాతవాసి, శైలజా రెడ్డి అల్లుడు, మహా సముద్రం, రావణాసుర, నా పేరు సూర్య, అల్లుడు అదుర్స్ ఇలా అన్నీ ఫ్లాప్స్ గానే మిగిలాయి. ఇప్పుడు ఈ అమ్మడి ఆశలన్నీ జపాన్ మూవీపైనే ఉన్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here