గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాను తెగ షేక్ చేస్తున్న సెలెబ్రేటి జంట పవిత్రా లోకేష్ – నరేష్.. ప్రేమ ఎప్పుడు, ఎలా, ఎవరిపై పుడుతుందో చెప్పలేము అంటూ లేటు వయస్సులో ఘాటు రొమాన్స్ తో ఈ జంట రెచ్చిపోతున్నారు.. ముగ్గురిని పెళ్లి చేసుకున్న నరేష్ ఈ వయస్సులో ఇంకొకరు అవసరమా అని నెట్టింట ఎంత విమర్శలు అందుకున్నా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు.. మా లైఫ్ మా ఇష్టం అంటూ తిరుగుతూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నారు.. వయస్సును కూడా మరచి సోషల్ మీడియాలో వరుసగా వీడియోలను వదులుతూ వచ్చారు.. అవి ఎంతగా వైరల్ అయ్యాయి చూసాము..

అయితే, సెలెబ్రేటీలు ఏ విషయం గురించి అయితే చెప్పుకోవడానికి సిగ్గపడతారని అనుకున్నామో.. అదే విషయాన్ని ఏకంగా ‘మళ్లీ పెళ్లి’ అంటూ అదే మహిళతో కలిసి సినిమా తీసి నిస్సిగ్గుగ్గా జనం ముందుకు వచ్చారు నరేష్, పవిత్రా లోకేష్‌లు.. ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలని వీరు చేసిన ప్రయత్నాలు, సినిమా ప్రమోషన్స్ జనాలకు ఆశ్చర్యాన్ని కలిగించాయానడంలో సందేహం లేదు.. అందులో భాగంగా అన్నీ వదిలేసి ఎన్నో విషయాలను మీడియాతో పంచుకున్నారు..
ఇద్దరు సహజీవనం చెయ్యడం మాత్రమే కాదు.. ఈ సందర్బంగా పిల్లల్ని కనడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు..ఈ వయసులో చాలామంది పిల్లల్ని కన్నారు కదా.. మరి మీకు అలాంటి ఉద్దేశం ఉందా అంటే పవిత్రా లోకేష్.. అందులో తప్పేం ఉందన్నట్టుగా సమాధానం ఇచ్చింది. ఇక నరేష్ అయితే ఇండైరెక్ట్ గా తాను ఎప్పుడో రెడీ అంటూ హింట్ ఇచ్చాడు.. మొత్తానికి వీరిద్దరూ కలిసి త్వరలోనే పిల్లల్ని కనాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పకనే చెప్పారు..ఇక ముందు ఆ వార్త కూడా వింటామేమో చూడాలి.. ఏది ఏమైనా వీళ్ళ సినిమా మాత్రం పర్వాలేదనే టాక్ ను అందుకుంది.. ఇక నెక్స్ట్ ఎలాంటి సినిమాను తీస్తారో చూడాలి..