Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో తనలోని మాస్ యాంగిల్ ని మరోసారి పరిచయం చేశాడు.. ఈసారి మాత్రం మాస్ వింటేజ్ కి అసలైన నిర్వచనం ఇవ్వనున్నాడు Chiranjeevi భోళా శంకర్ సినిమాతో మోహన్ రమేష్ దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.. హైదరాబాద్ లో వేసిన కలకత్తా సెట్స్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..

తమిళ్ లో అజిత్ నటించిన మాస్ మసాలా సూపర్ హిట్ సినిమా వేదాలం. ఈ చిత్రాన్ని చిరుతో రీమిక్స్ చేస్తున్నారు మోహర్ రమేష్. మాస్ వింటేజ్ మెగాస్టార్ ని మరో రేంజ్ లో చూపించడానికి సిద్ధమవుతున్నాడు. అందుకోసం చిరంజీవి సూపర్ హిట్ సినిమా చూడాలని ఉంది లోని రామ్మా చిలకమ్మా పాటను రీమిక్స్ చేయనున్నారు అనే టాక్ వినిపిస్తోంది. మణిశర్మ మ్యూజిక్ ని చిరంజీవి సౌందర్యల డాన్స్ ని అప్పట్లో తెలుగు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. ఈ పాటని రీమిక్స్ చేసి భోళా శంకర్ సినిమాలో పెట్టారట.

అలాగే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఖుషి నడుము సీన్ రిపీట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ భూమిక మధ్య ఉన్న నడుము సీన్ అప్పట్లో ఓ సెన్సేషన్.. కుర్రాళ్ళ గుండెల్ని కొల్లగొట్టింది ఈ సీన్. పవన్ భూమిక చేసిన ఈ నడుము సీన్ కుర్రాళ్లను అప్పట్లో హీట్ ఎక్కించింది. ఇప్పుడు అదే సీన్ ను చిరంజీవి శ్రీముఖి చేయనున్నారని సమాచారం. మోహర్ రమేష్ ఈ సీన్ యాంకర్ శ్రీముఖి చిరంజీవిల మధ్య డిజైన్ చేశారట. నువ్వు నా నడుము చూసావని శ్రీముఖి అంటే.. అక్కడ నడుము ఎక్కడ ఉంది అన్ని ముడతలే గాని మెగాస్టార్ సరదాగా మాట్లాడుకునే సీన్ ఒకటి మోహన్ రమేష్ అద్భుతంగా డిజైన్ చేశారట మరి ఈ సీన్ తో భోళా శంకర్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా మెగాస్టార్ కనిపించనున్నాడు.