Pallavi Prashanth :గత కొద్దిరోజుల నుండి సోషల్ మీడియా లో పల్లవి ప్రశాంత్ మరియు బర్రెలక్క వివాహం చేసుకోబోతున్నట్టు ఏ రేంజ్ లో వార్తలు ప్రచారమా అయ్యాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఈ వార్తలపై బర్రెలక్క రెస్పాన్స్ ఇచ్చి ‘ఆయన నాకు అన్నతో సమానం. నాలాగే ఒక మధ్యతరగతి కుటుంబం నుండి ఎదో సాధించాలని బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి టైటిల్ విన్నర్ గా నిలిచాడు. ఆయనకీ నా మద్దతు కూడా అనేకసార్లు తెలిపాను.నేను అయితే ఆయనని ఇప్పటి వరకు అన్నయ్య అనే పిలిచాను. అన్నా చెల్లెలు బంధం ఉన్నోళ్లు ఎక్కడైనా పెళ్లి చేసుకుంటారా..?, పనిపాట లేని వాళ్ళు పుట్టించే పుకార్లకు స్పందించాల్సిన అవసరం నాకు లేదు. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, నేను ఈ విషయాన్నీ సీరియస్ గా తీసుకొని ఉంటే ఇలాంటి అసత్య ప్రచారాలు చేసిన సైట్స్ అన్నిటిపై స్ట్రైక్స్ వేయించి ఉండేదానిని’ అంటూ చెప్పుకొచ్చింది.
అయితే ఈ వార్త పల్లవి ప్రశాంత్ వరకు చేరడం తో ఆయన కూడా దీనిపై రెస్పాన్స్ ఇచ్చాడు. మీరు చెప్పే దాకా ఈ వార్త ప్రచారం లో ఉందనే విషయం కూడా నాకు తెలియదు. బర్రెలక్క శిరీష అంటే నాకు ఎంతో గౌరవం. నాలాగే ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి జనాలకు మంచి చెయ్యాలని అనుకుంటుంది, ఆమెని నేను నా చెల్లిగా భావించాను. చెల్లి కోసం భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా సహాయపడుతాను అంటూ చెప్పుకొచ్చాడు.
పల్లవి ప్రశాంత్ పేరు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పటికంటే బయటకి వచ్చినప్పుడే ఎక్కువగా వినిపిస్తుంది. జరిగిన వివాదాలు అలాంటివి మరి. చంచల్గూడా జైలుకి కూడా ఆయన వెల్లసిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు బర్రెలక్క తో వివాహం అనే ఒక రూమర్ తో మరోసారి వార్తల్లో నిలిచాడు పల్లవి ప్రశాంత్. ఇకపోతే హౌస్ లో ఉన్నన్ని రోజులు తనతో అండగా ఉన్న శివాజీ , యావర్ తో కలిసి త్వరలోనే పల్లవి ప్రశాంత్ ఒక సినిమా చెయ్యబోతున్నాడు.