Pallavi Prashanth : వేరే లెవెల్ కి వెళ్లిపోయిన పల్లవి ప్రశాంత్.. ఒక్కరోజు సంపాదన ఎంతో తెలుసా?

- Advertisement -

Pallavi Prashanth : బిగ్ బాస్ రియాలిటీ షో ఎంతో మంది సెలెబ్రెటీలకు పునర్జన్మని ఇచ్చింది అనడం లో ఎలాంటి సందేహం లేదు. సినీ లేదా టెలివిజన్ రంగంలో దాదాపుగా ఫేడ్ అవుట్ స్థాయికి వచ్చిన నటీనటులు ఈ రియాలిటీ షో ద్వారా జనాలకు దగ్గరై మళ్ళీ అవకాశాలు సంపాదించుకున్నారు. అలాగే సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారు కూడా నేడు పెద్ద స్థాయికి చేరుకున్నారు. ఉదాహరణకి బిగ్ బాస్ సీజన్ 7 లో రైతు బిడ్డ గా, సామాన్యుడిగా అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ గురించి మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీ ని సంపాదించిన ఆయన, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత తన అద్భుతమైన ఆట తీరుతో కోట్లాది మంది ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొంది టైటిల్ విన్నర్ గా నిలిచాడు.

Pallavi Prasanth : పరారీలో పల్లవి ప్రశాంత్.. పోలీసుల గాలింపు.. - NTV Telugu

అంతే కాకుండా బిగ్ బాస్ ద్వారా గెలుచుకున్న ప్రైజ్ మనీ ని రైతుల కోసమే ఉపయోగిస్తాను అని చెప్పి, అదే విధంగా చేసి చూపించాడు కూడా. దీంతో పల్లవి ప్రశాంత్ రేంజ్ సోషల్ మీడియా లో ఒక్క స్టార్ హీరో  లెవెల్ కి ఎదిగిపోయింది. ఆయన ఏ చిన్న పోస్టు పెట్టినా వేల సంఖ్యలో లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి. బిగ్ బాస్ లోకి వెళ్ళకముందు ఆయనకీ ఇంస్టాగ్రామ్ ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలి అనే విషయం పై అవగాహన లేదు. కానీ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత వాటి గురించి తెలుసుకొని డబ్బులు సంపాదించుకునేలా మలుచుకున్నాడు.

- Advertisement -

Police Book Cases On Bigg Boss Telugu 7 Winner Pallavi Prashanth & His Fans For Nuisance; Full Details Inside - Filmibeat

ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కేవలం యూట్యూబ్, ఇంస్టాగ్రామ్ నుండి రోజుకి 40 వేల రూపాయిలను సంపాదిస్తున్నాడట. చాలా మంది సీరియల్ ఆర్టిస్టులు కూడా ఈ స్థాయిలో సంపాదించడం లేదనేది వాస్తవం. కేవలం సోషల్ మీడియా ద్వారానే ఇంత సంపాదిస్తే, ఇక సినిమాల్లోకి వస్తే ఆయన ఏ స్థాయిలో సంపాదిస్తాడో అని ఆయన అభిమానులు అనుకుంటూ ఉన్నారు. అయితే పల్లవి ప్రశాంత్ ఇప్పటి వరకు ఎలాంటి సినిమాలో కానీ, టీవీ షోస్ లో కానీ పాల్గొనలేదు. భవిష్యత్తులో అయినా వస్తాడో రాడో తెలియడం లేదు. బిగ్ బాస్ నుండి బయటకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఆయన ఒక్కటంటే ఒక్క ఇంటర్వ్యూ కూడా ఎవరికీ ఇవ్వలేదు. దీంతో ఆయన భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి అనేది ఆయన అభిమానులకు అర్థం కావడం లేదు.

Bigg Boss Telugu 7 winner Pallavi Prashanth absconded!

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here