Pallavi Prashanth : బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రోజు పోలీస్ రూల్స్ ని అతిక్రమించలేదని పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. పల్లవి ప్రశాంత్ సామాన్యుడు కాబట్టి అరెస్ట్ చేశారు, ఇదే ఒక సెలబ్రిటీ చేస్తే అరెస్ట్ చేస్తారా?, సామాన్యులకు ఒక న్యాయం, సెలెబ్రెటీలకు మరో న్యాయమా?, ఇదేమి సమాజం అని పల్లవి ప్రశాంత్ కి సపోర్టుగా నెటిజెన్స్ మొత్తం సోషల్ మీడియా లో పోస్టులు పెట్టారు. గెలిచినా ఉత్సాహం లో కుర్రాడు కాబట్టి ఎదో తెలియక తప్పు చేసాడు.

వార్నింగ్ ఇచ్చి వదిలేయాలి కానీ ఇలా చెయ్యడం ఏంటి అని చాలా మంది అభిప్రాయం. అయితే ఆస్తి నష్టం జరగకుండా, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మీద దాడులు చెయ్యకుండా ఆయన అభిమానులు ఉండుంటే నేడు ప్రశాంత్ మీద పోలీస్ కేసు వేసేవారు కాదేమో. ఆయన కారణంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగింది కాబట్టే పోలీసులు కేసు వెయ్యాల్సి వచ్చింది అని పలువురి అభిప్రాయం.

ఏది ఏమైనా మొత్తానికి పల్లవి ప్రశాంత్ బైలు మీద నిన్న సాయంత్రం జైలు నుండి బయటకి వచ్చాడు. బయటకి రాగానే ఆయన తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ‘మల్లా వచ్చినా’ అని పేరు మార్చేశాడు. అంతే కాకుండా ఇంస్టాగ్రామ్ లో బయో లో ‘స్పై’ టీం విన్నర్ అని కూడా అప్డేట్ చేసాడు. హౌస్ లో ఉన్నంత కాలమే శివాజీ, యావర్ మరియు పల్లవి ప్రశాంత్ కలిసి ఉన్నారు , ఆ తర్వాత బయటకి వచ్చాక ఎవరి జీవితం వాళ్లదే అని అందరూ అనుకున్నారు.

కానీ ప్రశాంత్ అరెస్ట్ అయ్యాక శివాజీ మరియు ప్రిన్స్ యావర్ సపోర్ట్ ఇవ్వడమే కాకుండా, ప్రశాంత్ తల్లితండ్రులకు అండగా కూడా నిలిచి వాళ్లకు ధైర్యం చెప్పాడు. ఇక భోలే శవాలీ అయితే తనకి తెలిసిన పెద్ద పెద్ద లాయర్స్ అందరినీ పిలిపించి మొత్తానికి బైలు వచ్చేలా చేసాడు. నిజంగా స్నేహితులు అంటే ఇలాగే ఉండాలి. మరో పక్క ‘స్పా’ బ్యాచ్ అని ఇన్ని రోజులు హౌస్ లో కొనసాగిన అమర్ దీప్ , ప్రియాంక మరియు శోభా శెట్టి ఎడమొహం, పెడమొహం అన్నట్టుగా ఉన్నారు. అమర్ దీప్ పై ఆ రేంజ్ లో దాడి జరిగిన తర్వాత ప్రియాంక మరియు శోభా శెట్టి కనీసం ఎలా ఉన్నారు, ఏమైంది అని కూడా అమర్ ని ఇప్పటి వరకు అడగలేదట.