Pallavi Prashanth : ఎదో సాధించాలి అనే తపన తో తన కలని నిజం చేసుకోవడానికి ఎంతో కస్టపడి చివరికి అనుకున్న లక్ష్యానికి చేరుకొని కోట్లాది మంది యువకులకు ఆదర్శంగా నిలిచాడు పల్లవి ప్రశాంత్. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి టైటిల్ ని గెలుచుకోవాలని ఇతను ఏ స్థాయిలో పోరాడాడో మనమంతా అప్పట్లో సోషల్ మీడియా లో చూసే ఉంటాము.

ఈ కలని నెరవేర్చుకోవడానికి అతను ఎన్ని వందల సార్లు అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టూ తిరిగి ఉన్నాడో ఆయన మాటల ద్వారానే పలు సందర్భాల్లో విన్నాము. వచ్చిన ఈ అద్భుతమైన అవకాశం ని ఎక్కడా కూడా వృధా చేసుకోకుండా మొదటి రోజు నుండి హౌస్ లో తనని మించిన తోపు ఎవ్వరూ లేరు అనే విధంగా ఆడుతూ వచ్చాడు ప్రశాంత్. మధ్యలో ఆయన ఆటకి కొంతమంది కంటెస్టెంట్స్ అడ్డుపడాలని చూసారు కానీ, రైతు బిడ్డ పవర్ ముందు నిలబడలేకపోయారు.

పల్లవి ప్రశాంత్ చాలా సున్నితమైన మనసు ఉన్న వ్యక్తి అనే విషయం బిగ్ బాస్ చూసిన ప్రతీ ఒక్కరికి అర్థం అయ్యింది. నా అనుకున్న వాళ్ళు నామినేషన్స్ చేసినప్పుడు ఎంతో ఎమోషనల్ అయ్యేవాడు. అలాంటిది మోసం చేస్తే తట్టుకోగలడా?, లేదు కదా!, అందుకే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టక ముందు ఒకసారి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడట. అప్పట్లో ప్రశాంత్ తన స్నేహితులతో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించాడట.
ఆ ఛానల్ లోని కంటెంట్ బాగా క్లిక్ అయ్యి డబ్బులు రావడం ప్రారంభం అవుతున్న సమయం లో ఆయన స్నేహితులు ఆ ఛానల్ నుండి ప్రశాంత్ ని తొలగించారట. ఈ సంఘటన ని తీసుకోలేకపోయాడట పల్లవి ప్రశాంత్. తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసాడట. ఆ సమయం లో తల్లిదండ్రులు ధైర్యం చెప్పి,ప్రోత్సహించడం తో మళ్ళీ రికవర్ అయ్యాడట. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.