Pallavi Prashanth : ఈ సీజన్ ప్రారంభం లో పల్లవి ప్రశాంత్ మీద జనాల్లో ఉన్న అభిప్రాయం వేరు..ఏమిటి ఇతను గేమ్స్ ఆడకుండా ఎప్పుడూ సానుభూతి పొందే కార్యక్రమాలు చేస్తున్నాడు, రతికా వెంట పడుతున్నాడు, అసలు ఎందుకు వచ్చాడు బిగ్ బాస్ హౌస్ కి అని అందరూ అనుకున్నారు. కానీ రోజులు గడిచే కొద్దీ అతని ఆట తీరుని చూసి, అంతకు ముందు విమర్శించిన వాళ్ళే శబాష్ అంటూ పొగడడం ప్రారంభించారు.
ఫిజికల్ టాస్కుల విషయం లో పల్లవి ప్రశాంత్ కి పోటీ ఎవ్వరూ లేరు, ఇతను సాధారణ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో ఆడాల్సిన వాడు కాదు, ఒలంపిక్స్ పోటీదారులతో ఆడాల్సిన వాడు, ఆ రేంజ్ ఉంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తూ ఉండేవారు. దానికి తగ్గట్టుగానే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ లో ఆడిన కొన్ని టాస్కులు ఒలంపిక్స్ పోటీలలో కూడా ఎవ్వరూ ఆడలేదని చెప్పొచ్చు.
ఉదాహారానికి ఈ వారం జరిగిన ‘టికెట్ టు ఫినాలే’ టాస్కులలో భాగంగా సొరంగం లో నిండిన ఇసుక ని మొత్తం బయటకి తీసి, అందులో నుండి బయటకి వచ్చి, కాళ్లకు తగిలించిన తాళం ని తీసుకొని మళ్ళీ ఆ సొరంగం నుండి వెళ్లి గంట కొట్టాలి. ఈ టాస్కుని పల్లవి ప్రశాంత్ కేవలం రెండు నిమిషాల్లో పూర్తి చేసాడు. అతని ప్రతిభ చూసి ప్రేక్షకులే కాదు, ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా నోరెళ్లబెట్టారు.
అసలు ఇది ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోయారు, కచ్చితంగా ఒలంపిక్స్ లో కూడా ఇంత వేగంగా ఎవ్వరూ పూర్తి చేసి ఉండరు. అంతే కాదు గతం లో ఒక ఫజిల్ టాస్కు ఉంటుంది. దానిని కేవలం 27 సెకండ్స్ లో పూర్తి చేసి అప్పుడు కూడా అందరినీ ఇదే విధంగా షాక్ కి గురి చేస్తాడు పల్లవి ప్రశాంత్. కచ్చితంగా పల్లవి ప్రశాంత్ ని ఒలంపిక్స్ కి పంపితే మాత్రం మన ఆంధ్ర ప్రదేశ్ తరుపున ఇండియా కి గోల్డ్ మెడల్ తెస్తాడు అంటూ సోషల్ మీడియా లో ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.