Bigg Boss : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి ఒక కామన్ మెన్ గా అడుగుపెట్టి, అద్భుతంగా టాస్కులు ఆడుతూ టైటిల్ విన్నింగ్ రేంజ్ కి వచ్చిన కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్. మొదటి రెండు వారాలు ఇతన్ని చూసి ఎప్పుడెప్పుడు బయటకి వెళ్ళిపోతాడా అని అనుకునేవారు ఆడియన్స్. ఎప్పుడైతే రతికా మాయ నుండి బయట పడ్డాడో, అప్పటి నుండి పల్లవి ప్రశాంత్ అద్భుతంగా టాస్కులు ఆడుతూ దుమ్ము దులిపేసాడు.
ఎన్నో సంవత్సరాల యాక్టింగ్ అనుభవం ఉన్న శివాజీ లాంటి హీరోనే ఓటింగ్ లో దాటేసాడంటే, పల్లవి ప్రశాంత్ కి ఆడియన్స్ నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో అర్థం చేస్కోవచ్చు. అయితే ప్రశాంత్ కి చాలా గట్టి పోటీని ఇస్తున్నాడు అమర్ దీప్. మొదటి 5 వారాలు ఇతని ఆట చూసి ఏమిటి ఇతను ఇలా ఆడుతున్నాడు అని అందరూ అనుకున్నారు. ఆ తర్వాతి వారం నుండి అమర్ టాస్కులలో, ఎంటర్టైన్మెంట్ పంచడం లో తన సత్తా చాటి టైటిల్ విన్నింగ్ రేస్ లోకి వచ్చాడు.
ప్రస్తుతం ఆన్లైన్ లో ఉన్న ఓటింగ్ ప్రకారం వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి టైటిల్ వచ్చే అవకాశం ఉంది. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 7 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. ఇందులో ఒకరు ఈ వీకెండ్ లో ఎలిమినేట్ అవ్వబోతుండగా, మరొకరు వచ్చే వారం మధ్యలో ఎలిమినేట్ అవ్వబోతున్నారు. ఈ వీకెండ్ శోభా శెట్టి కచ్చితంగా ఎలిమినేట్ అయిపోతుంది. ఇక ఆ మరుసటి వారం లో అర్జున్ కానీ, యావర్ కానీ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అందరూ అనుకుంటున్నారు.
అయితే నిన్నటి నుండి సోషల్ మీడియా లో పల్లవి ప్రశాంత్ ఎలిమినేట్ అవ్వబోతున్నాడు అని ఒక రూమర్ వచ్చింది. దీంతో ప్రశాంత్ ఫ్యాన్స్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కేవలం ప్రశాంత్ గురించి మాత్రమే కాదు, అమర్ గురించి, శివాజీ గురించి కూడా ఇలాంటి వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఇది కేవలం ఇరు వైపుల కంటెస్టెంట్స్ నచ్చని వారు చేసే దుష్ప్రచారం అని, ఈ ముగ్గురు మిడ్ వీక్ లో ఎలిమినేట్ అయ్యే సమస్య లేదని. టాప్ 3 కంటెస్టెంట్స్ వీళ్ళే అంటూ విశ్లేషకులు చెప్తున్నారు.