Pallavi Prashanth : పల్లవి ప్రశాంత్ చీకటి బాగోతం బట్టబయలు.. ఛీ.. కొడుతున్న జనాలు

- Advertisement -

Pallavi Prashanth : ‘బిగ్‌బాస్ 7’ షో అయిపోయి చాన్నాళ్లయింది. రైతుబిడ్డ అనే ట్యాగ్‌తో హౌసులో అడుగుపెట్టి విజేతగా నిలిచాడు పల్లవి ప్రశాంత్.. రూ.35 లక్షల ప్రైజ్‌మనీతో రైతులకు సాయం చేస్తానన్నాడు. మూడు నెలల కావస్తున్నా ఇంకా దాని గురించి ఊసేలేదని తెగ విమర్శలు వచ్చాయి. షోలు చేసుకుంటూ, ఎంజాయ్ చేస్తున్నాడని అందరూ మనోడిని తెగ ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఈయనపై మరో రకమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైతులను మోసం చేసి లక్షలు సంపాదిస్తున్నాడని జనాలు ఛీ కొడుతున్నారు. ఆయన రైతుల పేరు చెప్పుకుని డబ్బు సంపాదిస్తున్నాడని విమర్శిస్తున్నారు.. ఆయన చీకటి బాగోతాలు ఎవరికి తెలియవు అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పల్లవి ప్రశాంత్.. బిగ్ బాస్ 7 సీజన్‌లోకి ఓ సామాన్యమైన రైతు బిడ్డగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. గతంలో జరిగిన ఆరు సీజన్ల కంటే ఈసారి బిగ్‌బాస్.. ఊహించిన దానికంటే ఎక్కువగా వార్తల్లో నిలిచిందంటే కారణం రైతు బిడ్డే. రైతుబిడ్డ అనే ట్యాగ్‌తో జనాల్లో సింపతీ సంపాదించుకున్నాడు. ప్రేక్షకులు కూడా ఇతడు చెప్పింది నిజమా అబద్ధమా అనేది చూడకుండా నమ్మి ఓట్లు వేశారు. ఇక షోలో విజేతగా నిలిచిన తర్వాత అదే రోజు రాత్రి.. హైదరాబాద్‌లో ఇతడి అభిమానులు చేసిన హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కార్లు, బస్సుల అద్దాల పగలగొట్టి నానా రచ్చ చేశారు. దీంతో ప్రశాంత్ చాలా ఎమోషనల్ అవుతూ.. నా టైటిల్ ప్రైజ్ మనీ మొత్తం పేద రైతులకు పంచుతానంటూ హామీ ఇచ్చాడు. కానీ ఇప్పటి వరకు ఆయన డబ్బులు పంచలేదు. రీసెంట్‌గా ఒక లక్ష రూపాయలు మాత్రం పంచి పెద్ద హంగామా చేశాడు. ఇక ఆ తర్వాత ఆయన డబ్బు పంచాలన్న ఆలోచనలోనే లేనట్లు తెలుస్తోందని కొందరు అంటున్నారు.

- Advertisement -

దీంతో ఆయనను జనాలు తిట్టిపోస్తున్నారు. బిగ్ బాస్‌ హౌస్‌కు రైతుల పేరు చెప్పుకుని వెళ్లి, గెలిచావు. 15లక్షల కారు, విలువైన బంగారు హారం సంపాదించుకున్నావు. రూ.35 లక్షలు తెచ్చుకుని.. డబ్బులు పేద రైతులకు ఇస్తానంటూ అబద్ధాలు చెబుతావా.. నీ చీకటి బాగోతాలు తెలియడం లేదనుకుంటున్నావా. లక్ష పంచి మళ్లీ ఫేమ్ సంపాదించుకోవాలని చూస్తున్నావంటూ మండిపడుతున్నారు. అలాగే ప్రస్తుతం ప్రశాంత్.. భారీగా ఆదాయం సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి వెళితే రూ. 2 లక్షలకు పైగా తీసుకుంటున్నాడట. పల్లవి ప్రశాంత్ సంపాదన నెలకు రూ. 20 నుండి 30 లక్షలు అంటున్నారు జనాలు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here