Pallavi Prashanth : బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ కొనసాగిన విషయం తెలిసిందే. అయితే ఈ షోలో కామన్ మ్యాన్ గా అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రైతు బిడ్డ ట్యాగ్ వేసుకుని బిగ్ బాస్ హౌసులోకి ఎంట్రీ ఇచ్చి ఏడో సీజన్ విన్నర్ గా నిలిచాడు. భారీగా రెమ్యునరేషన్ అందుకున్నాడు. విన్నర్ హోదాలో పల్లవి ప్రశాంత్ కు రూ.35 లక్షల ప్రైజ్ మనీ.. దాంతో పాటు మారుతి సుజుకి బ్రెజా కారు, జోయాలుక్కాస్ నుంచి రూ.15 లక్షల గిఫ్ట్ వోచర్ కూడా దక్కాయి.
హీరో శివాజీ సపోర్ట్ తోనే పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచినట్లు ఆయనే స్వయంగా చెప్పాడు. తనను సొంత అన్న మాదిరిగా చూసుకుంటారని… బయట కూడా ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకున్నాడు. మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా అదే బంధం నేటికీ కొనసాగుతుంది. తాజాగా రైతు బిడ్డ గెలుచుకున్న కారు సెలెక్ట్ చేసేందుకు వెళ్లగా.. శివాజీని అహ్వానించాడు. ముందుగా కారు నడపాలని శివాజీని కోరాడు. నాన్న కోసం కారు కొన్నానంటూ ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్ షేర్ చేశాడు.
కాగా ఈ వీడియోలో శివాజీ కుడి కాలు పెట్టి కారులో కూర్చొన్నాడు. ఆయన మంచి మనసుకు నెటిజన్లు మరోసారి ఫిదా అయ్యారు. ఎదుటి మనిషి బాగుండాలని కోరుకునే వ్యక్తులే ఇలా చేస్తారని కొనియాడుతున్నారు. ఇక ముందు సీట్లో పల్లవి ప్రశాంత్ తండ్రి కూర్చున్నారు. డ్రైవింగ్ సీట్లో శివన్న.. వెనుక పల్లవి ప్రశాంత్ కూర్చున్నారు. అయితే ఈ వీడియో చూసిన కొంతమంది రైతులకు డబ్బులు పంచుతానని చెప్పి పూర్తిగా నువ్వే వాడేసుకుంటున్నావా అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు అది బిగ్ బాస్ ఇచ్చిన బహుమతి అది అని చెబుతున్నారు.
View this post on Instagram