Bigg Boss : ఈ ఏడాది కొద్దిరోజుల క్రితమే ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 7 ఎంత ఆసక్తికరంగా సాగుతుందో మన అందరికీ తెలిసిందే. హౌస్ లో కంటెస్టెంట్స్ అందరూ ప్రతీ టాస్కు ని ఎంతో అద్భుతంగా ఆడుతున్నారు. మొదటి నాలుగు వారాలు ‘పవర్ అస్త్ర’ టాస్కు ని ఆడిన కంటెస్టెంట్స్, ఇప్పుడు 5 వ వారం నుండి ‘కెప్టెన్సీ టాస్కు’ ని ఆడుతున్నారు. ఎంతో ఉత్సాహంగా, వాడావేడి వాతావరణం లో సాగిన ఈ కెప్టెన్సీ టాస్కు లో పల్లవి ప్రశాంత్ విజేత గా నిల్చి, ఈ సీజన్ మొట్టమొదటి కంటెస్టెంట్ గా నిలిచాడు.

నిన్న జరిగిన చివరి టాస్కులో గౌతమ్ మరియు ప్రశాంత్ మధ్య నువ్వా నేనా అనే రేంజ్ లో పోటీ జరిగింది. ఈ పోటీ లో గౌతమ్ కృష్ణ ఓడిపోగా, పల్లవి ప్రశాంత్ గెలిచాడు. పల్లవి ప్రశాంత్ గెలిచినా తర్వాత గౌతమ్ కి కరచాలనం ఇవ్వడానికి పోతే గౌతమ్ రిజెక్ట్ చెయ్యడం గమనార్హం.

ఇదంతా పక్కన పెడితే పల్లవి ప్రశాంత్ ఈ వారం ఎలిమినేట్ అవ్వబోతున్నాడు అంటూ గత కొద్ది రోజుల నుండి సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ కి ఇక్కడి వాతావరణం అసలు నచ్చడం లేదని, అక్కినేని నాగార్జున ని రిక్వెస్ట్ చేసి హౌస్ నుండి వెళ్ళిపోబోతున్నాడు అంటూ ఒక ప్రచారం జరిగింది.

దీని గురించి బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ ఆదిరెడ్డి స్టార్ మా ఛానల్ లో తనకి తెలిసిన కొంతమంది ని అడగగా, సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఈ వార్త ఫేక్ అని ఖరారు చేసాడు. ఇక ఈ వారం బిగ్ బాస్ హౌస్ లోకి మినీ లాంచ్ పేరుతో 7 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే సంగతి మన అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేసారు. ఈ ఎపిసోడ్ రేపు సాయంత్రం 7 గంటల నుండి ప్రారంభం కానుంది.
