Pallavi Prashanth : స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 7 ఎంత రసవత్తరంగా సాగుతూ ముందుకు దూసుకుపోతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ప్రతీ వారం ఎవ్వరూ ఊహించని ట్విస్టులతో పాటుగా ఆసక్తికరమైన గేమ్స్ తో ప్రేక్షకులను అలరిస్తుంది బిగ్ బాస్. ఇకపోతే ఈ వారం హౌస్ లో అలజడి రేపిన ఎపిసోడ్ నామినేషన్స్ ప్రక్రియ అని చెప్పొచ్చు.
భోలే శవాలీ తో ప్రియాంక మరియు శోభా శెట్టి పడిన గొడవ పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ మరియు సందీప్ మధ్య జరిగిన నామినేషన్ కూడా పెద్ద చర్చకి దారి తీసింది. పల్లవి ప్రశాంత్ ని సందీప్ ఊరోడు అని అన్నాడు అంటూ ప్రశాంత్ ఒక నింద వేస్తాడు. దీనికి సందీప్ ఒక రేంజ్ లో ఫైర్ అవుతాడు. నేను ఆ మాట అనలేదు అంటూ చాలా సేపు వాదిస్తాడు.
ఆ తర్వాత ఆయన నమ్ముకున్న వృత్తి డ్యాన్స్ పైన, తన భార్య జ్యోతి మీద ప్రమాణం చేసి నేను అసలు ఆ మాట అనలేదు అని అంటాడు. అలాగే పల్లవి ప్రశాంత్ ని కూడా నేను ఆ మాట అన్నాను అని నీ వృత్తి మీద, తినే అన్నం మీద ప్రమాణం చేసి చెప్పు అని అంటాడు, కానీ ప్రశాంత్ చెయ్యడు. అయితే నిన్న వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ఈ విషయం గురించి పల్లవి ప్రశాంత్ ని నిలదీస్తాడు. అప్పుడు ప్రశాంత్ నన్ను సందీప్ అన్న ఊరోడు అని అన్నాడని నేను అనలేదు అంటాడు.
అప్పుడు నాగార్జున పూజ ని పిలిచి అన్నాడా లేదా అని అడుగుతాడు. అప్పుడు నిజంగానే ఆ మాట అన్నాడు సార్, కానీ ఇప్పుడు మాట మారుస్తున్నాడు అని చెప్తుంది. ఆ తర్వాత అర్జున్ ని అడిగితే అతను కూడా అదే చెప్తాడు. అప్పుడు నాగార్జున మా దగ్గర పూర్తి వీడియో ఫుటేజ్ ఉంది, వెయ్యమంటే వేస్తాను అని అంటాడు. ఇలా అడ్డంగా దొరికిపోవడం తో పల్లవి ప్రశాంత్ కళ్ళలో నుండి నీళ్లు తిరుగుతాయి. ఎందుకు ప్రశాంత్ ఏడవడం, అయినా ఊరోడు అనే పదం తప్పు కాదు కదా, ఊర్లు లేకపోతే మనకి త్రింది కూడా ఉండదు, నేను మా నాన్న ఊరోడు అని గర్వం గా చెప్పుకుంటాను అని సమాధానం ఇస్తాడు నాగార్జున.