Shivatmika : టాలీవుడ్లో చాలా తక్కువ మంది హీరోయిన్లు మాత్రమే వరుసగా సినిమాలు చేస్తున్నారు. కానీ, వారి దురదృష్టమేంటో తెలియదు కానీ భారీ విజయాలను మాత్రం అందుకోలేకపోతున్నారు. అలాంటి వారిలో యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ కుమార్తె శివాత్మిక ఒకరు. కొన్నేళ్ల క్రితమే హీరోయిన్గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన ఈ అమ్మడు.. అప్పటి నుంచి బ్రేకులు లేకుండా సినిమాలు చేస్తూనే ఉంది. కానీ, తన కెరీర్లో చెప్పుకొదగిన హిట్ ను మాత్రం దక్కించుకోవడం లేదు. ఎన్ని ఫ్లాపులు వచ్చినా తన ప్రయత్నాలైతే ఆపట్లేదు. అదే సమయంలో సోషల్ మీడియాలో రచ్చ లేపుతూ..గ్లామరస్ పిక్స్ వదులుతోంది.
జీవితా రాజశేఖర్ దంపతులకు చిన్న కుమార్తె శివాత్మిక. ఈ అమ్మడు టీనేజ్‌లో ఉన్నప్పుడే తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయింది. తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టాలన్న లక్ష్యంతో అడుగులు వేసింది. ఇలా ‘దొరసాని’ అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ తీవ్ర నిరాశనే మిగిల్చింది. కానీ నటన పరంగా ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. సినిమాల్లో సరైన ఆరంభాన్ని అందుకోని శివాత్మిక రాజశేఖర్‌కు ఫలితంతో సంబంధం లేకుండా అవకాశాలు మాత్రమ వస్తూనే ఉన్నాయి. ఇలా గత ఏడాది ఈ చిన్నది ‘ఆకాశం’ అనే చిత్రంలో నటించింది. తెలుగు, తమిళంలో వచ్చిన సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత ‘పంచతంత్రం’, ‘రంగమార్తాండ’ సినిమాలు చేసింది. ఇవి కూడా ఆమెకు హిట్‌ను అందించలేకపోయాయి.
విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ.. తనదైన స్టైల్ లో సినిమాల్లో దూసుకుపోతుంది. అయితే ఇప్పటి వరకు నటించిన సినిమాల్లో స్కిన్ షో చేయని బ్యూటీ.. ఇకపై ఇందుకు సై అంటున్నట్లు తెలుస్తోంది. జిమ్ లో వర్క్ అవుట్ చేస్తున్న ఈ యంగ్ బ్యూటీ లేటెస్ట్ పోస్ట్ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. కాగా ‘ఫిట్ నెస్ అంటే శివాత్మిక.. శివాత్మిక అంటే ఫిట్ నెస్..లాంగ్ టైం నుంచి న్యూ ఇయర్ రిజోల్యూషన్ ఈ అబ్స్.. ఈ ఏడాది పూర్తి అయింది ‘ అంటూ ఫన్నీగా రాసుకొచ్చింది. ఇక దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఈ హాట్ నెస్ తట్టుకోలేకపోతున్నాం. ఇంత హాట్ గా ఉన్నావేంటి? ‘, ‘ నీ బాడీ మీద చెమటలు.. మాకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి ‘, ‘ అంటే ఇప్పుడు నువ్వు షో ఆఫ్ చేస్తున్నావా ‘ అంటూ బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
View this post on Instagram