Oscars 2024 : 96వ ఆస్కార్ అవార్డుల వేడుక వైభవంగా జరిగింది. సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే 96వ ఆస్కార్ అవార్డుల వేడుక అమెరికాలోని లాస్ ఏంజిల్స్ డాల్బీ థియేటర్ వేదికగా జరుగుతోంది. ఆస్కార్ బరిలో నిలిచేందుకు ప్రపంచం నలుమూలల నుండి చాలా సినిమాలు, చాలామంది నటీనటులు పాల్గొన్నారు. వారిలో స్టార్ రెజ్లర్ జాన్ సైనా కూడా హాజరయ్యారు. జాన్ సెనా 1998లో ఆయన బాడీబిల్డర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. తర్వాత డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూలో ఎన్నో మెడల్స్ సాధించి స్టార్ రెజ్లర్‌గా క్రేజ్. అంతేకాకుండా ది మెరైన్ అనే సినిమాలోనూ ఆయన నటించి మెప్పించాడు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 96వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం లాస్ ఏంజిల్స్‌లో ఎంతో అట్టహాసంగా జరగుతుంది. అయితే ఈ వేడుకలు నేడు తెల్లవారుజాము నుంచే ప్రారంభమైయ్యాయి. ఇందులో బెస్ట్ కాస్ట్యూమ్ అవార్డును ఇచ్చే అవకాశం జాన్ సేనాకు దక్కింది.

ఈ అవార్డును ఇవ్వడానికి జాన్ సైనా న్యూడ్‌గా స్టేజ్‌పైకి వచ్చి అందరినీ షాక్‌కు గురి చేశాడు. ఒంటి పై నూలు పోగు లేకుండా తన ప్రైవేట్ పార్ట్ కనిపించకుండా విన్నర్ పేరు ఉన్న బోర్డ్‌ను అడ్డుపెట్టుకుని కనిపించాడు. అంతేకాకుండా సినిమాల్లో కాస్ట్యూమ్ డిజైనర్ ఎంత అవసరమో తెలిసిందని అనే సరికి అంతా ఉన్న ఫళంగా నవ్వేశారు. ఆ తర్వాత మరో వ్యక్తి వచ్చి నామినీల పేర్లు వేస్తుండగా జాన్ సేనా బట్టలు ధరించాడు. వెంటనే విజేతను అనౌన్స్ చేసి అవార్డు ప్రదానం చేశాడు. అయితే బెస్ట్ కాస్ట్యూమ్ అవార్డ్స్ పూర్ థింగ్స్ సినిమాకు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం జాన్ సేనాకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన వారంతా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. స్టార్ రెజ్లర్ అయితే మాత్రం ఎంతో ప్రతిష్టాత్మక అవార్డుల ప్రదానోత్సవ వేదిక పై అలా చేయడమేంటంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
