Operation Valentine Trailer Review : ఆపరేషన్ వాలెంటైన్.. దేశభక్తి తో ప్రజలకు ముందుకు వస్తున్న మరో చిత్రం . ఈ చిత్రం మార్చి 1న విడుదల కానుండగా.. మంగళవారం (ఫిబ్రవరి 20న) ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో వరుణ్ తేజ్ స్టంట్స్, మానుషితో లవ్ ట్రాక్, పవర్ ఫుల్ పేట్రియాటిక్ డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి.
ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్
వరుణ్ తేజ్, మానుషి కలిసి ఆపరేషన్ వాలెంటైన్ చిత్రంలో నటిస్తున్నారు. ఫిబ్రవరి 14, 2019న పుల్వామాలో మన జవాన్లపై జరిగిన దాడి, ఆపై పాకిస్థాన్‌పై, అక్కడి ఉగ్రవాదులపై భారత వైమానిక దళం ప్రతీకారం తీర్చుకోవడం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా విడుదలైన ట్రైలర్ హై డోసేజ్ యాక్షన్, స్టంట్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఆకట్టుకుంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో విడుదల కానుంది.
వరుణ్ తేజ్ ఈ సినిమా ద్వారా బాలీవుడ్ కి పరిచయం అవుతుండగా, మానుషి టాలీవుడ్ కి రాబోతోంది. ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ శక్తివంతమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ రుద్రగా కనిపించాడు. అతని హైట్, పర్సనాలిటీ ఈ పాత్రకు సరిగ్గా సరిపోయాయి. అంతేకాదు ఎవరి మాట లెక్కచేయకుండా తనకు ఏమి అనిపిస్తుందో అదే చేసుకుంటూ ముందుకు పోయే విధంగా ఈ ట్రైలర్ లో కనిపిస్తాడు.. రుద్రకు చూస్తే దేశభక్తి ఉవ్వెత్తున ఎగిసి పడుతుందంటే అతిశయోక్తి కాదు.
పై నుంచి వచ్చిన ఆదేశాలను పాటించకుండా మొండిగా డేంజరస్ ఆపరేషన్లకు వెళ్లే క్యారెక్టర్ అతనిది. నిజానికి ఈ ట్రైలర్ ఆ సన్నివేశంతో మొదలవుతుంది. సడన్ గా వరుణ్ నిద్రలేస్తాడు.. అతని వద్ద నుంచి ఊపిరి సౌండ్.. తన వీపు ఛాతి పై గాయాలు ఉంటాయి.. రుద్ర బాడీ అంతా స్వెట్ కారుతూ ఉంటుంది. ఇందులో రుహానీ శర్మ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా కనిపించింది. గాలిలో కలిసి వీరు చేసే విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
ఆ తర్వాత వరుణ్, మానుషి మధ్య లవ్ ట్రాక్ కూడా ట్రైలర్లో చూపించారు. పుల్వామా దాడి, పాకిస్తాన్‌పై భారత వైమానిక దళం ప్రతీకారం తీర్చుకోవడం దానికి.. ఆపరేషన్ వాలెంటైన్ అని పేరుపెట్టడం ఆకట్టుకున్నాయి. ఈ ట్రైలర్ లో కొన్ని దేశభక్తి డైలాగ్‌ల యువతను ఉర్రూతలూగించాయి. చివర్లో, వరుణ్ పైలట్ చేసిన విమానం మంటలు అంటుకోవడం , అతను దాని నుండి బయటపడటానికి ప్రయత్నించడంతో ట్రైలర్ ముగుస్తుంది. ఇదంతా చూస్తున్న వారందరికి గూస్బంప్స్ రావడం ఖాయం.
వరుణ్ తేజ్ వాలెంటైన్
ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వరుణ్, మానుషి ఇటీవల ఇండియన్ ఐడల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వరుణ్ కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇందులో భాగంగా ఇటీవల వచ్చిన వాలెంటైన్స్ డేకి తన భార్య లావణ్య త్రిపాఠికి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేదని, ఆమె కూడా తనకు ఏమీ ఇవ్వలేదని చెప్పాడు. వారిద్దరూ ప్రేమికుల రోజు కోసం కాశ్మీర్‌కు వెకేషన్‌కు వెళ్లారని చెప్పుకొచ్చాడు వరుణ్. ఏదేమైనా ఈ ఆపరేషన్ వాలెంటైన్ తో వరుణ్ తేజ్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి. ఈ సినిమా మార్చి 1న విడుదల కానుంది.