Oori Peru Bhairavakona Collections : బోలెడంత టాలెంట్ ఉన్నప్పటికీ చేతిలో సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న హీరోలలో ఒకడు సందీప్ కిషన్. ఆయన హిట్ కొట్టాలని చాలా మంది కోరుకుంటూ ఉంటారు. అలా ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఊరి పేరు భైరవకోన’ కి మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. డిఫరెంట్ కథాంశం తో డైరెక్టర్ చాలా కొత్తగా ఈ సినిమాని తీసాడు అంటూ ఆడియన్స్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు.

పైడ్ ప్రీమియర్ షోస్ నుండే పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకున్న ఈ సినిమా, ఇప్పటికీ డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది. ఇకపోతే ఈ సినిమా విడుదలై సరిగ్గా నేటికి వారం రోజులు పూర్తి అయ్యింది. ఈ వారం రోజులకు ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి వివరంగా చూద్దాం.

ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 9 కోట్ల 50 లక్షల రూపాయలకు జరిగింది. మొదటి వారం ఈ చిత్రానికి అన్నీ ప్రాంతాలకు కలిపి దాదాపుగా 7 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ఇది సందీప్ కిషన్ కెరీర్ లోనే హైయెస్ట్ వసూళ్లు అని ట్రేడ్ పండితులు అంటున్నారు. సినిమాలేవీ లేకపోవడం తో ఇప్పటికీ ఈ చిత్రానికి థియేటర్స్ లో డీసెంట్ స్థాయి వసూళ్లు వస్తున్నాయి.

ఇక ఓవర్సీస్ లో అయితే ఈ సినిమా ఇప్పటి వరకు 3 లక్షల 50 వేల డాలర్స్ ని రాబట్టింది అట. ఫుల్ రన్ లో కచ్చితంగా ఈ సినిమా హాఫ్ మిలియన్ డాలర్ మార్కుని అందుకుంది అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇప్పటి వరకు సందీప్ కిషన్ కి ఈ ప్రాంతం లో కనీసం లక్ష డాలర్లు వచ్చిన సినిమా కూడా లేదు, అలాంటిది ఈ చిత్రం ఏకంగా హాఫ్ మిలియన్ డాలర్స్ అంటున్నారంటే సాధారణమైన విషయం కాదనే చెప్పాలి.
