Tamannaah Bhatia : హీరోయిన్ తమన్నా బాలనటిగా నటించిన ఏకైక సినిమా అదేనా..?

- Advertisement -

Tamannaah Bhatia : సౌత్ ఇండియాలో టాప్ మోస్ట్ హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో తమన్నా కచ్చితంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పాలరాతి శిల్పం లాగ కనిపించే అందం అద్భుతమైన నటన, డ్యాన్స్ ఇలా అన్నీ రకాల టాలెంట్లు ఒకే హీరోయిన్ లో ఉండడం మనం చాలా తక్కువ మందిలో చూసి ఉంటాం. అందుకే ఆమెతో పాటు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఎంతో మంది హీరోయిన్లు రిటైర్ అయిపోయే స్థితిలో ఉన్నప్పటికీ, తమన్నా మాత్రం ఇప్పటికీ క్రేజీ ఆఫర్స్ తో ముందుకు దూసుకుపోతుంది. కేవలం అందాల ఆరబోతకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను మాత్రమే చేస్తుంది. అయితే తమన్నా మొదటి సినిమా ఏమిటో, ఆమెకి ఏ సినిమా నుండి సరైన కెరీర్ మొదలైందో మన అందరికీ తెలిసిందే.

Tamannaah Bhatia
Tamannaah Bhatia

మంచు మనోజ్ హీరో గా నటించిన ‘శ్రీ’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమెకి తమిళం లో పలు అవకాశాలు వచ్చాయి. కొన్ని సినిమాల్లో నెగటివ్ రోల్స్ లో కూడా మెరిసింది. అయితే అవి ఆమెకి పెద్దగా పేరు తీసుకొని రాలేదు. అలాంటి సమయంలో ఆమెకి తెలుగు లో శేఖర్ కమ్ముల దర్శకత్వం లో వచ్చిన ‘హ్యాపీ డేస్’ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత ఆమె మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలను సంపాదిస్తూ అనతి కాలం లోనే ఎవ్వరూ ఊహించని కి చేరుకుంది.

The 25+ Best Tamanna Bhatia Movies, Ranked By Fans

- Advertisement -

ఇదంతా పక్కన పెడితే తమన్నా హీరోయిన్ అయ్యే ముందే బాలనటిగా పలు సినిమాల్లో నటించింది అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అప్పట్లో ఆమె ‘హమ్ హైన్ బెమిశాల్’ అనే చిత్రం లో బాలనటిగా నటించింది. ఈ చిత్రం లో సునీల్ శెట్టి, అక్షయ్ కుమార్ హీరోలు గా నటించారు. ఆ తర్వాత తమన్నా పలు హిందీ సీరియల్స్ లో కూడా బాలనటిగా చేసిందట. అలా ఆమె కెరీర్ హీరోయిన్ అవ్వకముందే ప్రారంభం అయ్యిందని తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా తమన్నా ప్రస్తుతం హిందీ లో రెండు సినిమాలు, తెలుగు లో ఒక సినిమా చేస్తుంది.

Indian Celebrities: Tamanna Actress Biography, Family, Profile, Filmography, Telugu Tamil Actress Tamanna Pictures, Childhood photo

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here