టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ మరియు ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆ రెండు పదాలు వింటే మన అందరికీ గుర్తువచ్చే మొట్టమొదటి పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అందుకే ఆయన సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతుంటాయి. ఇక సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఉంటారో మన అందరికీ తెలిసిందే.

ఇంస్టాగ్రామ్ అయినా , ట్విట్టర్ అయినా , యూట్యూబ్ అయినా మరియు ఫేస్ బుక్ అయినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హుంగామ మామూలు రేంజ్ లేదు. ట్విట్టర్ మరియు ఫేస్ బుక్ లో పవన్ కళ్యాణ్ చాలా కాలం నుండి ఉన్నాడు కానీ, ఇప్పటి వరకు ఇంస్టాగ్రామ్ లోకి మాత్రం ఆయన ఎంట్రీ ఇవ్వలేదు. గత రెండు రోజుల క్రితమే ఆయన ఇంస్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టుగా అధికారికంగా ఒక ప్రకటన చేసారు.

అయితే ఈరోజు కాసేపటి క్రితమే ఆయన ఇంస్టాగ్రామ్ లోకి అధికారికంగా ఎంట్రీ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చాడు అనే విషయం తెలిసిన వెంటనే అభిమానులు తండోపతండాలుగా ఇంస్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చి పవన్ కళ్యాణ్ ని ఫాలో అవ్వడం మొదలు పెట్టారు. మొదటి గంటలోనే లక్ష మందికి పైగా ఫాలోవర్స్ వచ్చారు. ఆ తర్వాత రెండు గంటల్లో 5 లక్షలకు పైగా ఫాలోయర్స్ వచ్చారు. ఇదంతా ఒక్క పోస్టు కూడా వెయ్యకుండా సంపాదించుకున్న ఫాలోవర్స్.

ఇలాగే ఒక్క పోస్ట్ కూడా లేకుండా ఆయన 6 గంటల్లో 1 మిలియన్ ఫాలోయర్స్ కౌంట్ ని కూడా దాటేశాడు, అలా ఒక్క పోస్ట్ కూడా లేకుండా 1 మిలియన్ ఫాలోయర్స్ ని దక్కించుకున్న ఏకైక ఇండియన్ సెలబ్రిటీ గా పవన్ కళ్యాణ్ చరిత్ర సృష్టించాడని అభిమానులు సోషల్ మీడియా లో గర్వంగా చెప్పుకుంటున్నారు. మరి 24 గంటల్లో ఆయనకీ ఏ రేంజ్ ఫాలోవర్స్ రాబోతున్నారో చూడాలి.
