Bro The Avatar పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మ్యాజిక్ ఏంటో ఎవరికీ అర్థం కాదు..ఒక పక్క తన తోటి స్టార్ హీరోలు పాన్ ఇండియా పాన్ వరల్డ్ సినిమాలు చేస్తూ పోతుంటే, ఈయన మాత్రం రీమేక్ సినిమాలు చేస్తాడు. ఇతర భాషల్లో రీమేక్ సినిమాలు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు, కానీ ఒక్కటి కూడా సక్సెస్ అవ్వడం లేదు. కానీ పవన్ కళ్యాణ్ విషయం వేరే. ఒక స్టార్ హీరో భారీ బడ్జెట్ తో, పాన్ ఇండియన్ లెవెల్ లో సినిమా తీసిన రాని ఓపెనింగ్స్ ని పవన్ కళ్యాణ్ కేవలం రీమేక్ సినిమాతో రప్పిస్తాడు.
ఇదే ఎవరికీ అంతు చిక్కని మ్యాజిక్. ఆయన హీరో నటించిన లేటెస్ట్ చిత్రం ‘బ్రో ది అవతార్’ మరో 5 రోజుల్లో మన ముందుకు రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా ప్రారంభం అవ్వలేదు కానీ, ఓవర్సీస్ లో మాత్రం 10 రోజుల క్రితమే బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.
సాధారణంగా అక్కడి జనాలు రీమేక్ సినిమాకి కదలడం అనేది జరగదు. చాలా తక్కువ, ఎంత మంచి పాజిటివ్ టాక్ వచ్చినా కూడా వసూళ్లు రావు. అది మిగిలిన హీరోలకు మాత్రమే , పవర్ స్టార్ విషయం లో అది పూర్తిగా బిన్నం. కనీసం ట్రైలర్ కూడా రాకముందే ఈ సినిమా అమెరికా లో 70 వేల డాలర్లు వసూలు చేసింది. ఇక నిన్న ట్రైలర్ విడుదల కాగానే లక్ష డాలర్లకు ఎగబాకింది.
ఇది నిజంగా ఎవ్వరూ ఊహించనిది. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ అక్కడ ఇంకా మొదలు అవ్వలేదు. ఈ మంగళవారం రోజు పూర్తి స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. అప్పుడు ఈ సినిమా కేవలం ప్రీ సేల్స్ ద్వారానే 7 లక్షల డాలర్లు వసూలు చేస్తుందని, టాక్ వస్తే కేవలం ప్రీమియర్ షోస్ నుండే 1 మిలియన్ డాలర్స్ వస్తాయని అంటున్నారు. చూడాలి మరి.