Rashmika : మరో సారి ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న రష్మిక డీప్ ఫేక్ వీడియో.. మరింత అసభ్యకరం

- Advertisement -

Rashmika : స్టార్ హీరోయిన్లు సోషల్ మీడియా పుణ్యమా అని విపరీతంగా ట్రోల్స్ కు గురవుతున్నారు. మొన్నీ మధ్య పలువురి హీరోయిన్ల డీప్ ఫేక్ వీడియోలు సంచలనం సృష్టించాయి. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న కు సంబంధించిన ఓ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో ఎలాంటి విధ్వంసాన్ని సృష్టించిందో తెలిసిందే. ఓ బోల్డ్ వీడియోకు రష్మిక ఫేస్‌ను సెట్ చేసి నెట్టింట షేర్ చేశారు. దీనిపై చాలా మంది సెలబ్రెటీలు స్పందించారు. ఇప్పటికే పలువురు హీరోయిన్స్ డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియా అంతటా వైరల్ అయ్యాయి.

రష్మిక టార్గెట్‌గా ఆగంతకులు మరో ఫేక్ వీడియోను క్రియేట్ చేశారు. రెడ్ బికినీలో ఉన్న రష్మిక డీప్ ఫేక్ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో రష్మిక రెడ్ బికినీలో స్నానం చేస్తున్నట్లుగా ఉంది. ఇది డీప్ ఫేక్ వీడియోగా గుర్తించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఈ డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేశారు కేటుగాళ్లు.

- Advertisement -

రెడ్ బికినీలో వాటర్ ఫాల్ వద్ద నిల్చుని ఫోటోలకు పోజులిస్తున్నట్లుగా కనిపిస్తున్న ఈ వీడియో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియో అప్ లోడ్ చేయగానే వెంటనే వైరల్ అయింది. పోస్ట్ చేసిన వెంటనే లైక్స్, షేర్స్ విపరీతంగా వచ్చాయి. వీడియోను చూసిన వారంతా వీడియోలో ఉన్నది రష్మికనే అనుకుని అవాక్కయ్యారు. నిజంగా రష్మికనే అని నమ్మేశారు. వాస్తవానికి అది డీప్ ఫేక్ వీడియో. ఫ్యాక్ట్ చెక్‌ చేయగా ఆ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో క్రియేట్ చేసినట్లు తేలింది. డీప్ ఫేక్ వీడియోలో వాడిన ఒరిజినల్ వీడియోను డానియెలా విల్లారియల్ అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. కొలంబియాకు చెందిన ఓ కంటెంట్ క్రియేటర్‌కు సంబంధించిన వీడియో అది. ప్రస్తుతం ఆ అమ్మాయి వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here