OG Movie : పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఓవైపు రాజకీయాలు.. మరోవైపు సినిమాలతో సూపర్ బిజీగా ఉన్నాడు. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతున్నందున తాను ఒప్పుకున్న సినిమాలను త్వరగా పూర్తి చేసి పాలిటిక్స్ లో బిజీ అవ్వాలనే ప్లాన్ లో ఉన్నాడు. తన లైనప్ లో ఇప్పటికే బ్రో సినిమాతో థియేటర్లలో పూనకాలు తెప్పించాడు. వింటేజ్ పవర్ స్టార్ ను మరోసారి థియేటర్లలో చూసిన ఫ్యాన్స్ తెగ మురిసిపోయారు. కలెక్షన్లలో.. మౌత్ టాక్ లో బ్రో సినిమా పవర్ స్టార్ ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది. ఇక తన నెక్స్ట్ సినిమా పనుల్లో బిజీ అయ్యాడు పవన్.

పవర్ స్టార్ తదుపరి సినిమాలు హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ (ఒరిజినల్ గ్యాంగస్టర్). ఇటీవలే ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. పవర్ స్టార్ పోలీస్ లుక్ లో కనిపించి అదరగొట్టాడు. ఇది మరో గబ్బర్ సింగ్ లో పవన్ కు వసూళ్లు తెచ్చిపెడుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరోవైపు యంగ్ అండ్ స్టైలిష్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘OG’పైనా ప్రేక్షకులకు భారీ అంచనాలున్నాయి. 1990 నాటి ముంబయి మాఫియా బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైంది. ముంబయిలో పలు షెడ్యూళ్లను కూడా షూటింగ్ పూర్తైంది. ఇప్పటికే 50 శాతంపైగా టాకీ పార్టును పూర్తి చేసుకున్నట్లు తెలిసింది. ఇటీవలే.. హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్‌తో ఓ గ్లింప్స్‌ను పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు మేకర్స్. ఈ గ్లింప్స్‌లో కోలీవుడ్ నటుడు అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారని రెండు మూడు రోజులుగా ప్రచారం సాగుతోంది.
అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి మరో సూపర్ అప్డేట్ గురించి నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ గ్లింప్స్ వీడియో 72 సెకెన్లు లేదా 1.12 నిమిషాల నిడివితో రాబోతుందని తెలిసింది. ఇందులో పవన్ కల్యాణ్ స్టైలిష్ గెటప్‌తో కనిపిస్తారట. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా ఉండనుందట. ఈ గ్లింప్స్ క్లైమాక్స్‌లో పవన్ ఓ పవర్‌ఫుల్ డైలాగ్ చెబుతారని, అవి అభిమానులకు పూనకాలు తెప్పిస్తాయని టాక్.ఈ వీడియో టాలీవుడ్‌లో ఎప్పుడూ చూడని విధంగా ఓ స్పెషల్ అనుభూతిని ఇవ్వబోతుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో TheyCallHimOG పేరుతో తెగ ట్రెండింగ్ అవుతోంది.
ఇకపోతే ఈ మూవీని RRR నిర్మాత దానయ్య.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా.. ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మీ, శ్రీయా రెడ్డి సహా పలువురు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ తెగ ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు.