NTR : దేవర… కొరటాల శివ-ఎన్టీఆర్ కలిసి చేస్తున్న పాన్ ఇండియా సినిమా. నందమూరి అభిమానులని చాలా రోజుల పాటు వెయిట్ చేయించి సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ, కొన్ని రోజులు షూటింగ్ జరుపుకోగానే ఒకటి కాదు రెండు భాగాలుగా దేవర సినిమా తెరకెక్కుతుంది అంటూ కొరటాల శివ స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో దేవర సినిమా నుంచి పార్ట్ 1 ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుంది పార్ట్ 2 తర్వాత వస్తుందని అందరూ ఒక అంచనాకి వచ్చేసారు. రిలీజ్ డేట్ టార్గెట్ గా షూటింగ్ చేస్తున్నాం, డేట్ మిస్ అయ్యే ప్రసక్తే లేదని కళ్యాణ్ రామ్ కూడా చెప్పాడు. రిలీజ్ డేట్ లాక్ చేసారు కాబట్టి దేవర పార్ట్ 1 థియేటర్స్ లోకి వచ్చేస్తుంది అనుకుంటే సడన్ గా దసరా 10కి దేవర వాయిదా పడింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అప్సెట్ అయ్యారు. అప్సెట్ అయిన ఫ్యాన్స్ ని కూల్ చేస్తూ కొరటాల శివ ఒక పోస్టర్ వదిలాడు.

గతంలో దేవర మేకర్స్ వదిలిన వీడియోకి, లేటెస్ట్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ లో ఉన్న ఎన్టీఆర్ కి తేడా ఉంది. లుక్స్ నుంచి డ్రెసింగ్ వరకు ప్రతి విషయంలో ఎన్టీఆర్ లో డిఫరెన్స్ ఉంది. దీంతో ఎన్టీఆర్ దేవర సినిమాలో రెండు క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నాడు, ఒకటి వీడియోలో ఉన్న ఏజ్డ్ లుక్ కాగా మరొకటి లేటెస్ట్ గా రిలీజ్ చేసిన యంగ్ లుక్ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో డిబేట్స్ చేస్తున్నారు.
ఈ డిబేట్ ని మరింత బలపరుస్తూ లేటెస్ట్ టైటిల్‌లో ‘దేవర’లో ‘వర’ రెడ్ కలర్‌తో ఉంది. దీంతో ఎన్టీఆర్ ఈ సినిమాలో దేవ్, వర అనే రెండు పాత్రల్లో కనిపిస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. రెండు పాత్రలు ఒకే గానీ అది తండ్రి కొడుకులుగానా లేక అన్నదమ్ముల్లాగా అనే కన్ఫ్యూజన్ ప్రేక్షకుల్లో ఉంది. దేవర పోస్టర్స్‌ను బట్టి… రెండు క్యారెక్టర్స్ మధ్య పెద్దగా ఏజ్ గ్యాప్ కనిపిచండం లేదు కానీ ముందు నుంచి మాత్రం ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా కనిపిస్తారనే టాక్ ఉంది. మరి దేవర ఇద్దరా? ఒకరా? తండ్రీ కొడుకులా? బ్రదర్సా? అనే క్లారిటీ రావాలంటే… అక్టోబర్ 10 వరకు వెయిట్ చేయాల్సిందే.