NTR : వర ఆగమనానికి రంగం సిద్ధమయ్యింది. సముద్ర వీరుడు పాన్ ఇండియా బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి డేట్ ఫిక్స్ చేసుకోని వస్తున్నాడు. పాత రికార్డులని రిపేర్ చేయడానికి కొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరగా అక్టోబర్ 10న వస్తున్నాడు. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ తర్వాత వస్తున్న దేవర సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఇందులో నుంచి పార్ట్ 1 అక్టోబర్ 10న రిలీజ్ చేస్తున్నాం అంటూ మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఇస్తూ మేకర్స్ కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. ఇందులో ఎన్టీఆర్ వేటాడడానికి సిద్ధంగా ఉన్న పులిలా ఉన్నాడు. దేవర టైటిల్ లో ‘వర’కి మాత్రం రెడ్ కలర్ వేసి కొరటాల శివ బాక్సాఫీస్ రికార్డ్స్ కి డేంజర్ బెల్స్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఏప్రిల్ 5నే ఆ
డియన్స్ ముందుకి రావాల్సిన దేవర సినిమా అనేక కారణాల వలన వాయిదా పడింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ విషయంలో చాలా డిజప్పాయింట్ అయ్యారు. ఏప్రిల్ 5నే దేవర రిలీజ్ అయితే లాంగ్ వీకెండ్ వచ్చేది… ఒకటి రెండు వర్కింగ్ డేస్ మినహా దాదాపు 18 రోజుల హాలిడేస్ కలిసొచ్చి దేవర సినిమా కలెక్షన్స్ కి చాలా హెల్ప్ అయ్యేది. మంచి రిలీజ్ డేట్ మిస్ అవ్వడంతో నందమూరి అభిమానులు ఫీల్ అయ్యారు. ఈ డేట్ మిస్ అయినా సరే రికార్డుల దుమ్ము దులపడం మాత్రం గ్యారెంటీ అంటూ దసరా సీజన్ ని టార్గెట్ చేసాడు ఎన్టీఆర్. అక్టోబర్ 12న దసరా పండగ ఉంది, ఈ ఫెస్టివల్ సీజన్ ని పాన్ ఇండియా స్థాయిలో కాష్ చేసుకుంటే మాత్రం… దేవర సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం పక్కా.