Mamatha Mohandas : అతనితో పీకల్లోతూ ప్రేమలో ఎన్టీఆర్ హీరోయిన్.. కానీ ఇప్పుడు..

- Advertisement -

Mamatha Mohandas గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ మూవీ యమ దొంగ సినిమా అందరికీ గుర్తే ఉంటుంది.. ఆ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించారు. అందులో హీరోయిన్ మమతా మోహన్ దాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అడపా దడపా సినిమాల్లో నటించింది.. అందులో ఈ సినిమా మంచి టాక్ ను అందించింది.. ఈ అమ్మడు చాలా కాలం తర్వాత ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో నటించబోతుంది.. మహారాజా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఈ సినిమా ప్రమోషన్లో తన సీక్రెట్ లవ్ గురించి ఓపెన్ అయ్యింది..దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది.

Mamta Mohandas diagnosed with autoimmune disease vitiligo after successful  battle with cancer - India Today

మమతా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే క్యాన్సర్ బారిన పడింది.. కొన్నాళ్లపాటు చికిత్స తీసుకుని చివరకు కోలుకుంది. క్యాన్సర్ తో పోరాటం తర్వాత చాలా కాలం విశ్రాంతి తీసుకున్న మమతా.. గతేడాది రుద్రంగి తో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది.. ఇప్పుడు విజయ్ సేతుపతి సరసన మహారాజా సినిమాలో నటిస్తుంది.. ఈనెల 14 న సినిమా విడుదల కాబోతుంది..

- Advertisement -

తాజాగా ఈ సినిమా ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉంది..తాజాగా మహారాజా ప్రమోషన్లలో పాల్గొంటున్న మమతా మోహన్ దాస్ తన లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది..అలాగే తన డేటింగ్ పై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది. గతంలో లాస్ ఏంజిల్స్ లో ఉన్నప్పుడు ఒకరిని ప్రేమించాను. కానీ మా రిలేషన్ ఎక్కువకాలం నిలవలేదు. జీవితంలో రిలేషన్ ఉండాలి. దానివల్ల వచ్చే ఒత్తిడిని మాత్రం నేను కోరుకోవడం లేదు అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సినిమాల పై మాత్రమే ఫోకస్ పెట్టినట్లు తేల్చి చెప్పేసింది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here