Devara #RRR వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వం లో ‘దేవర’ చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆచార్య వంటి ఘోరమైన డిజాస్టర్ తర్వాత కొరటాల శివ నుండి వస్తున్న సినిమా అయ్యినప్పటికీ కూడా, ఎన్టీఆర్ స్టార్ స్టేటస్ కారణంగా ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ మరియు మొదటి లిరికల్ వీడియో సాంగ్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియా లోనే కాకుండా, బయట కూడా ఎక్కడ చూసినా ఈ సినిమాకి సంబంధించిన పాటనే వినిపిస్తుంది.

మొదటి పాట ఈ స్థాయిలో హిట్ అవ్వడంతో రెండవ పాటపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. నిన్న ఈ పాటకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. నేడు ఈ పాటకి సంబంధించిన చిన్న మ్యూజిక్ బిట్ ని విడుదల చేసారు. నిన్న పోస్టర్ విడుదల చెయ్యగా, నేడు వీడియో లో ఎన్టీఆర్ జాన్వీ కపూర్ తో రొమాన్స్ చేస్తున్న స్టిల్ పెట్టారు. అయితే నిన్న విడుదల చేసిన పోస్టర్ లో ఎన్టీఆర్ రెండు కాళ్ళు సగమే కనిపిస్తాయి. ఇది సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ట్రోలింగ్ కి గురైంది. ఎన్టీఆర్ కి ఈ సినిమాలో కాళ్ళు ఉండవా?, కుంటివాడా అని వెక్కిరిస్తున్నారు.
ప్రొడక్షన్ విలువలు చాలా నీచంగా ఉన్నాయని, పేరుకి 300 కోట్ల రూపాయిల బడ్జెట్ అని అంటున్నారు కానీ, ఇప్పటి వరకు విడుదల చేసిన పోస్టర్స్ ని చూస్తే చాలా చీప్ క్వాలిటీ లాగ అనిపిస్తుందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈరోజు విడుదల చేసిన మ్యూజిక్ బిట్ కూడా అనుకున్న స్థాయిలో లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ఆగస్టు 15 వ తారీఖున విడుదలయ్యే పూర్తి స్థాయి లిరికల్ వీడియో సాంగ్ కి ఆడియన్స్ నుండి ఫ్యాన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాబోతుందో చూడాలి.