Ram Prasad : తొమ్మిదేళ్లుగా అతడితో రష్మీ ప్రేమాయణం.. సంచలన నిజాలు చెప్పిన ఆటో రాంప్రసాద్

- Advertisement -

Ram Prasad : బుల్లితెర హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత యాంకర్ గా మారింది రష్మీ. జబర్దస్త్ షో లో ఎంట్రీ ఇచ్చి.. తన గ్లామర్ తో తనకంటూ ఓ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌తో చేసే అల్లరి, డ్యాన్స్‌లతో అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఏకంగా వీళ్లిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారనే వార్తలు కూడా హల్ చల్ చేశాయి. సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా ఉంటూ హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ కుర్రకారు మతిపోగొడుతుంది. ఇక ప్రస్తుతం ఎక్స్ట్రా జబర్దస్త్ షో లో రష్మీ యాంకర్ గా కొనసాగుతూనే ఉన్నారు.

ఇక ఇదిలా ఉంటే.. బుల్లితెరపై రష్మీ, సుధీర్ లవ్ స్టోరీకి ఒక సెపరేట్ ఫ్యాన్ క్రేజ్ ఉంది. వారి మధ్య పాటలు, డైలాగులు, ఎక్స్ ప్రెషన్స్ తో అందరినీ కట్టిపడేస్తుంటారు. వేదికపై ఎమోషనల్ సీన్స్, ప్రపోజల్స్, ఎంగేజ్‌మెంట్, ఆఖరికి సుడిగాలి సుధీర్, రష్మి పెళ్లి చేసుకున్నట్టుగా కూడా అనేక ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి మల్లెమాల ప్రొడక్షన్స్ కమర్షియల్‌గా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడంలో గ్రాండ్ సక్సెస్ అయింది. వీళ్ల ఆన్ స్క్రీన్.. లవ్ ట్రాక్ చూసి నిజంగానే వీళ్లు ప్రేమించుకుంటున్నారని.. ఆఫ్ స్క్రీన్ లో ఒకటవుదామని అనుకుంటున్నట్లుగా అప్పట్లో ఎన్నో పుకార్లు వచ్చాయి. కానీ ఎప్పటికప్పుడు మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే నంటూ అందంతా కేవలం ప్రమోషనల్ స్టంట్ అని చెప్పినా.. పెళ్లి వార్తలు మాత్రం ఇప్పటికీ ఆగడం లేదు.

- Advertisement -

ఇక ఇదిలా ఉంటే తాజాగా రష్మీ గౌతమ్ ప్రేమాయణం గురించి ఇన్ డైరెక్ట్ గా రామ్ ప్రసాద్ ఓ ప్రోగ్రాంలో చెప్పాడు. రష్మీ తొమ్మిదేళ్లుగా లవ్ ట్రాక్ నడిపిస్తుందని.. అయితే ఎవరన్నది మాత్రం ఆయన చెప్పలేదు. దీంతో చాలా మంది ఇంతకీ రష్మీ తొమ్మిదేళ్లుగా నడుపుతున్న లవ్ ట్రాక్.. సుడిగాలి సుధీర్ యేనా లేకపోతే వేరొకరా అని ఆలోచిస్తున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here