బుల్లితెర కామెడీ షో పటాస్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఫైమా జబర్దస్త్ ద్వారా మంచి కమెడియన్ గా పేరు సంపాదించుకుంది. కామెడీ పంచులకు పెట్టింది పేరు పైమా. అలాంటి ఆమె నిలువ నీడలేని పరిస్థితి నుండి హైదరాబాదులో ఇల్లు, స్థలాలు కూడా కొనుక్కుని ఓ స్థాయికి ఎదిగిందని తెలుస్తోంది.అలాంటి ఫైమా గురించి కొన్ని విషయాలు చూద్దాం.. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో తల్లి కూలి పనులు చేస్తూ తన ముగ్గురు అక్క చెల్లెళ్లను పెద్ద చేసింది. అద్దె ఇంట్లో ఉంటూ కనీసం బాత్రూం, సౌకర్యం కూడా లేదు.

యాంకర్ రవి ఆమెను ఎంకరేజ్ చేసి పటాస్ లో చేసేందుకు అవకాశాన్ని ఇప్పించాడు. ఇక అప్పటినుండి వెనక్కి తిరిగి చూసుకొని ఫైమా వరుస షోలు చేస్తూ బిజీగా మారింది. దాని తర్వాత పోవే పోరా జబర్దస్త్ వంటి షోలలో ఈమె కామెడీతో అందరినీ ఆకట్టుకుంది. గత ఎడాది ఫైమా బిగ్ బాస్ 6 లో కూడా వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇలా వరుసగా షోలలో అటు బిగ్ బాస్ లో పాల్గొన్న ఫైమా బాగానే సంపాదించినట్టు తెలుస్తోంది.

ఈ మధ్యనే లగ్జరీ కారును కూడా కొనుగోలు చేసింది. ‘జబర్దస్త్’ ‘బిగ్ బాస్’ ‘బిబి జోడి’ ‘యూట్యూబ్’.. ఇలా అన్నిటి ద్వారా ఫైమా భారీగానే సంపాదించినట్టు తెలుస్తుంది. మొత్తంగా ఆమెకు ప్రస్తుతం కోటి పైనే ఆస్తులు ఉన్నాయి. తనలోని కామెడీ టైమింగ్ ఫైమాకి బాగా ప్లస్ అయ్యింది. గతంలో ఎన్నో అవమానాలు పొందింది. నల్లగా ఉందని ఆమెను ఎంతో మంచి అవహేళన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఫైనల్ అందం తిండి పెట్టదు.. టాలెంట్ అన్నీ తెచ్చి పెడుతుంది అని ఈమె ప్రూవ్ చేసింది. ఇల్లు, కారు కొనుక్కొని ఉన్నదాంట్లో హ్యాపీగా ముందుకు వెళ్తోంది. అలా పైమా సంపాదించిన ఆస్తులు కోటికి పైగానే ఉంటాయని తెలుస్తోంది.