Japan : తమిళ హీరో కార్తీ నటించిన లేటెస్ట్ చిత్రం ‘జపాన్’ రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. నటుడిగా కార్తీకి మంచి పేరు వచ్చింది, కానీ సినిమాలో కథ మరియు కథనం ఇవన్నీ కూడా చాలా సిల్లీ గా అనిపించడం తో అంత నెగటివ్ టాక్ వచ్చింది. కానీ కార్తీకి యూత్ లో ఉన్న క్రేజ్ కారణంగా, ఆ రేంజ్ డిజాస్టర్ టాక్ వచ్చినప్పటికీ కూడా డీసెంట్ రేంజ్ లో ఓపెనింగ్స్ దక్కాయి.
కానీ రెండవ రోజు నుండి మాత్రం వసూళ్లు దారుణంగా పడిపోయాయి. 25 చిత్రం వచ్చిన ఈ సినిమా కార్తీకి చేదు జ్ఞాపకం ని మిగిలించింది. ‘సర్దార్’ , ‘విరూమాన్’ మరియు ‘పొన్నియన్ సెల్వన్’ సిరీస్ తో తమిళ నాడు బాక్స్ ఆఫీస్ షేక్ చేసిన కార్తీ, అదే సక్సెస్ స్ట్రీక్ ని కొనసాగిస్తాడు అనుకుంటే, ఇలా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ ని మూటగట్టుకున్నాడు.
ఇది ఇలా ఉండగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అన్నీ ప్రాంతీయ భాషలకు కలిపి నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసింది. విడుదలైన 50 రోజుల తర్వాత స్ట్రీమింగ్ చెయ్యాలి అనేది అగ్రిమెంట్. కానీ సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చింది, ఇంకో రెండు రోజులు దాటితే షేర్ వసూళ్లు రావడం కూడా ఆగిపోతాయి, అందుకే నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ నెలలోనే సినిమాని స్ట్రీమింగ్ చేసుకునే అవకాశం ఇప్పిస్తే ముందు అనుకున్న రేట్ కి డబుల్ ఇస్తామని ఆఫర్ చేసారు.
సినిమాకి ఎలాగో నష్టం వస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు, కనీసం ఈ డీల్ అయినా ఒప్పుకుంటే ఎంతో కొంత నష్టం పుడుతుంది అని, ఈ నెలలోనే ఓటీటీ స్ట్రీమింగ్ కి ఒప్పుకున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుంది.