Noor Malabika Das : ఆత్మహత్య చేసుకున్న హీరోయిన్.. కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం

- Advertisement -

Noor Malabika Das : కొన్ని మరణ వార్తలు వింటే గుండెల్లో కలుక్కుమంటుంది. ఏదో తెలియని బాధతో నిట్టూరుస్తాం. నూర్ మాళవిక దాస్ 37 ఏళ్లు చాలా అందగత్తె.. చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంది. 2023లోనే ది ట్రయల్ అనే ఓ లీగల్ డ్రామాలో కాజోల్ సరసన కూడా నటించి అలరించింది. వరుసగా హిందీ సినిమాలు, వెబ్ సీరీస్ చేస్తుంటుంది. తన స్వరాష్ట్రం అస్సాం. విషాదం ఏంటంటే ఆమె మృతదేహం ఓ కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. వెండితెరపై తారలా వెలిగిన ఆమె చివరకు అనాథ శవంగా మారింది. అయినవాళ్లు కూడా దహనసంస్కారాలకు నిరాకరించారు. చివరకు ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో పోలీసులే ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు.

ముంబైలోని లోఖండ్‌వాలాలోని ఓ ఫ్లాట్‌లో ఒంటరిగా నూర్ మాళవిక దాస్ ఉంటోంది. ఇంట్లో ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ నెల క్రితం వరకూ ఆమె తన కుటుంబంతోనే ఉండేది. కానీ రెండు వారాల క్రితం ఆమె కుటుంబం అస్సోం వెళ్లిపోయింది. దీంతో ఈమె ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఉంటోంది. హఠాత్తుగా ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి బలవంతంగా తలుపులు తెరిచి చూసి షాక్ అయ్యారు. తన దేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. ఆమె ఫోన్, డైరీ, ఆమె వాడుతున్న మెడిసిన్స్ స్వాధీనం చేసుకుని, పోస్ట్ మార్టం చేయించి, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కానీ వాళ్లు రాలేదు. దాంతో పోలీసులే ఒక స్వచ్ఛంద సంస్థ సాయం తీసుకున్నారు. దహన సంస్కారాలు నిర్వహించారు.

- Advertisement -

ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కానీ ప్లాట్ మెయిన్ డోర్ లోపల నుంచి గడియ వేసి ఉండటంతో వారం పాటు ఆ శవం అలా వేలాడుతూనే ఉంది. చివరకు దేహం కుళ్లి దుర్వాసన ఇరుగూపొరుగుకు ప్రబలింది. దీంతో వాళ్లు రిపోర్ట్ చేసి, పోలీసులు వచ్చేదాకా ఆమె చనిపోయిన విషయం ఎవరికీ తెలియదు. తన మరణం పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here