Anchor Suma : యాంకరింగ్ రంగం లో సుమ ని కొట్టే యాంకర్ ఇప్పటి వరకు రాలేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. మన చిన్నతనం లో ఉన్నప్పటి నుండి ఈమెని యాంకర్ గా చూస్తూనే ఉన్నాం. అప్పట్లో ఎంత డిమాండ్ ఉండేదో, ఇప్పుడు కూడా అదే రేంజ్ డిమాండ్ తో కొనసాగుతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చిందంటే చాలు ఎవరు ఉన్నా లేకపోయినా సుమ మాత్రం కచ్చితంగా ఉండాల్సిందే.

ఒక్కో ఈవెంట్ కి ఈమె సుమారుగా 10 నుండి 15 లక్షల రూపాయిల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఆ రేంజ్ డిమాండ్ ఉన్న యాంకర్ ఈమె. అలాంటి యాంకర్ ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ కోసం ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చింది అంటే అది మామూలు విషయం కాదు. ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్ మరెవరో కాదు సోహైల్.

ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘బూట్ కట్ బాలరాజు’. ఈ సినిమా ఫిబ్రవరి 2 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో సోహెల్ హీరో గా నటించడమే కాకుండా, నిర్మాతగా వ్యవహరించాడు కూడా. తాను సంపాదించిన డబ్బులతో పాటుగా, అతని నాన్న రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బులను పెట్టి ఈ సినిమాని తీసాడట.

అంటే అతని దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని ఇందులో పెట్టేసాడు అన్నమాట. ఇక ఆయన దగ్గర నయా పైసా కూడా మిగిలి లేదు. అందుకే సుమ అతని కోసం ఫ్రీ గా యాంకరింగ్ చెయ్యడానికి ఒప్పుకుంది. సుమ లాంటి టాప్ మోస్ట్ డిమాండ్ ఉన్న యాంకర్ ఇలా ఒకరి కోసం ఉచితంగా తన సమయం ని కేటాయించడం అనేది చిన్న విషయం కాదు. దీనికి ఆమెని ఎవరైనా మెచ్చుకోవాల్సిందే.