Nithin : టాలీవుడ్ స్టామినా ఏంటో ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా ‘బాహుబలి’. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా, రానా విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో నితిన్ కూడా నటించాడని తెలుసా ? మీరు ఎప్పుడైనా ఈ విషయం గమనించారా? అయితే వెంటనే యూట్యూబ్ ఆన్ చేసి ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ టీజర్‌ను చూడండి. అందులో బాహుబలి సినిమాలో నితిన్ ఉన్నాడో లేడో మీకే తెలుస్తోంది. నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ’. ఈ సినిమాలో ఆయనకు జంటగా శ్రీలీల నటిస్తుంది. ఈ సినిమాలో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నేపథ్యంలో ఈ చిత్ర టీజర్‌ను మూవీ టీం విడుదల చేసింది.

ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగానే ఈ సినిమాలో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ గా కనిపించనున్నాడు. ‘భయ్యా కథంటే మామూలు కథ కాదు భయ్యా.. రియల్ ఇన్సిడెంట్‌ని చూసి రాసుకున్న కథ’ అన్న డైలాగ్ తో ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ’ టీజర్ స్టార్ట్ అవుతుంది, ఛేజ్, ఫైట్, గన్ ఫైరింగ్ తో నితిన్ ని ఓ రేంజ్ లో పరిచయం చేసి.. లాస్టుకు జూనియర్ ఆర్టిస్ట్ అని రివీల్ చేయడం చాలా ఫన్నీగా అనిపించింది. అలాగే ‘నువ్వు కొబ్బరిమట్ట సినిమాలో ఉన్నావు కదా’ అని నితిన్ ని శ్రీలీల ప్రశ్నించడం, ‘బాహుబలిలో ఆరో లైన్ లో ఏడోవాడు ఎవరో తెలుసా?’ అని సంపత్ రాజ్ తో నితిన్ చెప్పిన డైలాగ్ చాలా కామెడీగా అనిపించింది. అంతేకాదు బాహుబలి సీన్ ని తీసుకొని, గ్రాఫిక్స్ లో నితిన్ ఫేస్ యాడ్ చేసి చూపించారు. దానిని సంపత్ రాజ్ కి ప్రూఫ్ లాగా నితిన్ చూపించడం భలే అనిపించింది. మొత్తానికి టీజర్ చూస్తుంటే ఇదొక మంచి ఎంటర్టైనర్ అని అర్థం అయిపోతుంది.
