Niharikha: విడాకుల విషయంలో నిహారిక నెక్స్ట్ స్టెప్ తీసుకుంది..

- Advertisement -

Niharikha: మెగా డాటర్ నిహారిక చైతన్య జొన్నలగడ్డని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే కొన్నాళ్లపాటు వీరిద్దరూ వారి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేశారు. అయితే అనూహ్యంగా వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ తెరపైకి ఓ న్యూస్ రావటంతో.. జనాలందరూ ఈ విషయంపై హాట్ హాట్ డిస్కషన్ చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా కూడా మీరు కుటుంబాల నుంచి ఎవ్వరు స్పందించకపోవడం ఆలోచించదగ్గ విషయం..

Niharikha
Niharikha

ఇంస్టాగ్రామ్ లో ఇద్దరూ ఒకరినొకరు అన్ఫాల్లో చేసుకోవడంతో ఈ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లయింది. ఇటీవల నిహారిక భర్త చైతన్య జొన్నగడ్డ ఏకంగా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుంచి తన పెళ్లి ఫోటోలను కూడా డిలీట్ చేయడంతో మరోసారి ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. ఆ తరువాత నిహారిక కూడా తన పెళ్లి ఫొటోస్ డిలీట్ చేయడంతో జనాలకి ఇండైరెక్టుగా ఓ క్లారిటీ ఇచ్చారు వీళ్లిద్దరు.

ఇక వీళ్ళు విడాకులు తీసుకోవడం కన్ఫర్మ్ అయిందో లేదో తెలియదు కానీ, నిహారిక మాత్రం ప్రస్తుతం కెరియర్ పైన ఫుల్ ఫోకస్ పెట్టింది. ఒక మనసు సినిమాతో వెండి తెర కు హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ తరువాత మరో రెండు చిత్రాలలో నటించిన కూడా నటిగా సక్సెస్ కాలేక పోయింది. నిహారికకు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో ఒక బ్యానర్ ఉంది. ఈ నిర్మాణ సంస్థలో ఆమె కొన్ని వెబ్ సిరీస్ లు, సినిమాలు నిర్మించారు. ఇక ఈ బ్యానర్లో కొత్త ప్రాజెక్ట్స్ తెరకెక్కించేందుకు నిహారిక సీరియస్ గా ముందుకు వెళ్తున్నారు. యంగ్ ఫిలిం మేకర్స్ రైటర్స్ తో చర్చలు జరుపుతున్నారు. ఇందుకు సంబంధించిన అప్డేట్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ క్రమంలో నిహారిక నిర్మాతగా సంచలనాలు చేయడం ఖాయం అనిపిస్తుంది. ఇక విడాకుల తరువాత నెక్స్ట్ నిర్మాతగా తన సత్తా నిరూపించుకోవడం కోసం ఇప్పటినుంచే సన్నాహాలు చేస్తోందంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు గుప్పుమంటున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here