Niharika : సోషల్ మీడియా లో ఈమధ్య కాలం లో నాగబాబు, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, నిహారిక కొణిదెల పేర్లు బాగా ట్రెండ్ అవుతున్నాయి. అందుకు కారణం వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠిలు కొత్తగా పెళ్లి చేసుకోవడమే. ఇండస్ట్రీ లో తమకంటూ ఒక ప్రత్యేక స్థానం ని సంపాదించుకున్న ఈ ఇద్దరు టాలీవుడ్ లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరిగా మారిపోయారు.

అయితే ఇప్పుడు వీళ్లంతా ఎవరి పనులతో వారు బాగా బిజీ అయిపోయారు. వరుణ్ తేజ్ అతి త్వరలోనే ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. ఇక లావణ్య త్రిపాఠి రీసెంట్ గానే ‘మిస్ పర్ఫెక్ట్’ అనే వెబ్ సిరీస్ తో మన ముందుకు వచ్చాడు. ఈ సిరీస్ కి రెస్పాన్స్ అంతంతమాత్రంగానే ఉంది. ఇక నాగబాబు రాజకీయాల్లో బిజీ గా గడుపుతున్నాడు. అలా కుటుంబం మొత్తం ఫుల్ బిజీ గా మారిపోయింది.

నిహారిక కూడా ఇప్పుడు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేసింది. గత ఏడాదే ఈమె హీరోయిన్ గా ఒక సినిమాని ప్రారంభించింది. ఇదంతా పక్కన పెడితే కొంతకాలం క్రితం భర్త చైతన్య తో విడాకులు తీసుకున్న నిహారిక ప్రస్తుతం నాగబాబు ఇంట్లోనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈమె అతి త్వరలోనే ఆ ఇల్లుని ఖాళీ చేసి దూరం వెళ్లిపోవాలని చూస్తుంది. వరుణ్, లావణ్య కి పెళ్లయింది కదా, అందుకే వాళ్లకి ప్రైవసీ కోసం నిహారిక అలా చేస్తుందేమో అని సోషల్ మీడియా లో ఒక రూమర్ నడిచింది.

కానీ అసలు కారణం అది కాదంట, నిహారిక కి ఒంటరిగా ఉండడం అంటే చాలా ఇష్టమట. తాను సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుతో ఒక ఇల్లు కట్టుకుంటుంది. దీనికి డబ్బులు ఇంకా సరిపోకపోవడం తో వాళ్ళ నాన్న వద్ద అప్పు చేసి ఇల్లు కడుతుందట. తనకి అన్నీ విషయాల్లో స్వేచ్ఛ ఉండాలని, అందుకోసంగానే దూరంగా వెళ్ళిపోతున్నాను అంటూ చెప్పుకొచ్చింది నిహారిక.
