Niharika Konidela : మెగా బ్రదర్ నాగబాబు కూతురిగా నిహారిక కొణిదెల కి ఇండస్ట్రీ లో ఎంత మంచి ఫేమ్ ఉందో మన అందరికీ తెలిసిందే. ఆ కూతురిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నిహారికకి ఒక్కటంటే ఒక్క సక్సెస్ కూడా దక్కలేదు. దీంతో సినిమాలకు దూరమై చైతన్య అనే అతన్ని పెళ్లి చేసుకోవడం, కొంత కాలం అతనితో కాపురం చేసిన తర్వాత విడిపోవడం వంటివి జరగడం మనమంతా చూసాము.

గత కొంతకాలం నుండి ఒంటరి జీవితం గడుపుతున్న నిహారిక, త్వరలోనే రెండవ పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియా లో ప్రచారం జరిగింది. కానీ ఆమె అలాంటి రూమర్స్ కి చెక్ పెడుతూ మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. ఇప్పటికే ఆమె ఒక నిర్మాతగా పలు వెబ్ సిరీస్ లను నిర్మించింది. అవి కమర్షియల్ గా ఆమెకి వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది.

ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియా లో తరచూ యాక్టీవ్ గా ఉంటూ తనకి సంబంధించిన ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఉండే నిహారిక కొణిదెల, రీసెంట్ గా థాయిలాండ్ కి వెళ్లి అక్కడ అడవుల్లో తిరుగుతూ, ఏనుగులతో కలిసి ఫోటోలు దిగడం వంటివి మనమంతా చూసాము. ఇప్పుడు రీసెంట్ గా ఆమె మెగా ఫ్యామిలీ యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ తో కలిసి దిగిన ఫోటోని అప్లోడ్ చేస్తూ ‘హ్యాపీ బర్త్ డే..లవ్ యు బాబు’ అంటూ పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ పోస్ట్ లో వైష్ణవ్ తేజ్ ని గట్టిగా హాగ్ చేసుకుంటూ ఆమె సన్నిహితంగా ఉన్నట్టుగా మనం గమనించొచ్చు. ప్రస్తుతం వీళ్లంతా కలిసి బెంగళూరు ఫార్మ్ హౌస్ కి పయనం అయ్యారు. అక్కడ గ్రాండ్ గా సంక్రాంతి సంబరాలు జరుపుకోనున్నారు.
