Niharika Konidela : మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల కి రెండేళ్ల క్రితం చైతన్య అనే అబ్బాయితో అంగరంగ వైభవంగా రాజస్థాన్ లో వివాహం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. కొన్నేళ్ల పాటు ఎంతో అన్యోయంగా గడిపిన ఈ జంట మధ్య కొన్ని అనుకోని అభిప్రాయం భేదాలు రావడం వల్ల విడిపోవాల్సి వచ్చింది. వీళ్ళ వివాహ మహోత్సవం అప్పట్లో ఒక సెన్సేషనల్ టాపిక్ అయ్యింది.

చేసుకుంటే ఈ రేంజ్ లో పెళ్లి చేసుకోవాలి, అది జీవితం అంటే అని అందరూ అసూయ పడేలా ఈ వివాహం జరిగింది. బహుశా అలా ఎక్కువ దిష్టి పెట్టడం వల్లనే ఏమో నిహారిక మరియు చైతన్య విడిపొయ్యే పరిస్థితి ఏర్పడింది అని అభిమానులు అంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం నిహారిక అన్నయ్య వరుణ్ తేజ్ మరియు ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి కి ఇటలీ లో ఘనంగా పెళ్లి జరగబోతున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే మెగా ఫ్యామిలీ మొత్తం ఇటలీ కి చేరుకుంది. రేపు సోషల్ మీడియా మొత్తం వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి పెళ్లి ఫోటోలు మరియు వీడియోలతో కళకళలాడిపోబోతుంది. ఇదంతా పక్కన పెడితే నిహారిక కొణిదెల తన కొత్త ప్రియుడితో ఇటలీ లో లంచ్ డేట్ కి వెళ్లినట్టు సోషల్ మీడియా లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. నిహారిక అతనినే రెండవ పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

పెళ్లి లో అతనిని మెగా ఫ్యామిలీ మొత్తానికి పరిచయం చేయబోతోందని, ఈ వివాహం నిహారిక తో పాటుగా మనం అతనిని చూడొచ్చు అని తెలుస్తుంది. చాలా కాలం నుండి నిహారిక రెండవ పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి కానీ, అది నిజమో కాదో ఎవరికీ క్లారిటీ లేదు. రేపటితో ఆ క్లారిటీ వస్తుందని అంటున్నారు ఫ్యాన్స్. ఆ వ్యక్తి ఇండస్ట్రీ కి చెందిన వాడా?, లేదా బయట వాడా అనేది చూడాలి.