మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకోబోతుంది అంటూ గత కొద్దిరోజులకు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇలా నిహారిక విడాకులు వార్తలు గురించి రోజుకో విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ ఈ వార్తలపై మెగా ఫ్యామిలీ ఏ విధంగాను స్పందిస్తూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఇలా నిహారిక చైతన్య విడాకుల గురించి వార్తలు రావడానికి కారణం లేకపోలేదు. జొన్నలగడ్డ వెంకట చైతన్య నిహారికల వివాహం 2021 సంవత్సరంలో జరిగింది అయితే గత కొద్ది రోజులుగా ఎక్కడ జంటగా కలిసి కనిపించలేదు అదేవిధంగా ఇంస్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు.
ఈ మధ్యకాలం లో నిహారిక సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ కి గురవుతోంది. ఎప్పుడైతే నిహారిక జొన్నలగడ్డ చైతన్య ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ఒక వార్త తెర మీద వినిపించిందో అప్పటి నుండి ఎక్కువగా నిహారిక ని మెగా హేటర్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇక నిహారిక ని పెళ్లయ్యాక సినిమా ల్లో నటించకూడదు అని జొన్నలగడ్డ చైతన్య (Jonnalagadda Chaithanya) కండిషన్ పెడితే ఈ విషయం లో ఓకే చెప్పిన నిహారిక ఆ తర్వాత కొన్ని రోజుల కు మళ్ళీ సినిమా ల్లో నటించాలని నిర్ణయించుకుందట. ఈమె నిర్ణయం తో ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయట. దాంతో తన సోషల్ మీడియా ఖాతా లో నిహారిక (Niharika) కు సంబంధించిన ఫోటోలన్ని డిలీట్ చేసి ఆమె ను అన్ఫాలో చేశారు చైతన్య.
భర్తకు ఇష్టం లేకపోయినా నటిస్తుందంటే తనతో ఉండడం లేదని చెప్పకనే చెప్పింది. చైతన్య ఉన్నన్ని రోజులు సైలెంట్ గా ఉన్న నిహారిక ఇప్పుడు వరుస సినిమాలు షూటింగ్ లు అంటూ తిరుగుతోంది. దీంతో మరోసారి ఈ వార్త కన్ఫామ్ చేసుకుంటున్నారు నెటిజన్లు. నిహారిక ఈ ఒక్క ఫోటోని మాత్రమే ఉంచడంతో నేటిజన్స్ సైతం ఈ ఒక్క ఫోటో కూడా ఎందుకు ఉంచడం దీనిని డిలీట్ చేయొచ్చుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా నిహారిక విడాకుల విషయం మాత్రం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. మరి ఈమె విడాకుల విషయంలో క్లారిటీ రావాలి అంటే మెగా ఫ్యామిలీ స్పందించాల్సి ఉంది.