Rajamouli : ఎంత రాజమౌళి సినిమా అయినా, హద్దులు దాటే బడ్జెట్ పెట్టమంటే కొన్ని సార్లు నిర్మాతలకు కూడా ఇబ్బంది కలుగుతుంది. ఒక హీరో తో భారీ సినిమా తియ్యాలంటే భారీ సమయం, భారీ ఖర్చులు ప్రతీసారి అవసరమా అని రాజమౌళి ని చూసినప్పుడు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇండస్ట్రీ లో కొత్త డైరెక్టర్స్ వచ్చేస్తున్నారు. వాళ్ళు ఏ రేంజ్ లో ఉన్నారంటే, రాజమౌళి సైతం వణికించే రేంజ్ లో ఉన్నారు.

రీసెంట్ గా ‘హనుమాన్’ చిత్రం తో ప్రశాంత్ వర్మ తన సత్తాని ఏ రేంజ్ లో చాటి చెప్పాడో మనమంతా చూసాము. అతి తక్కువ బడ్జెట్ తో 500 కోట్ల రూపాయిల రేంజ్ క్వాలిటీ ని తీసుకొచ్చాడు, అందరినీ సంబ్రమాశ్చర్యంలోకి నెట్టేశాడు. రాజమౌళి అలా తక్కువ బడ్జెట్ లో సినిమా తియ్యలేడా?, అంత టాలెంట్ ఆయనకీ లేదా అని అంటున్నారు నెటిజెన్స్.

RRR తర్వాత ఇప్పుడు ఆయన మహేష్ బాబు తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. ఫారెస్ట్ అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కే ఈ సినిమా ని కె ఎస్ రామారావు అనే సీనియర్ నిర్మాత నిర్మాణం లో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమాకి బడ్జెట్ వెయ్యి కోట్ల రూపాయిలు కావాలని రాజమౌళి అడుగుతున్నాడట. అంత బడ్జెట్ నేనెక్కడి నుండి తీసుకొని రమ్మంటావ్ అని రామారావు రాజమౌళి ని అడగగా, ఎలాగోలా చెయ్యండి, ఇది పాన్ వరల్డ్ సినిమా అన్నాడట.

కానీ అంత మొత్తం లో ఫైనాన్స్ చేసేవాళ్ళు రామారావు కి దొరకడం లేదు. దీంతో ఆయన నిర్మాత దిల్ రాజు ని సంప్రదించాడు. ఆయనకి ఈ సినిమాపై డబ్బులు పెట్టడానికి ఆసక్తి ఉందట. ఇప్పుడు ఈ చిత్రం వీళ్లిద్దరు కలిసి సంయుక్తంగా నిర్మించబోతున్నారు. వెయ్యి కోట్ల రూపాయిల బడ్జెట్ అంటే చిన్న విషయం కాదు, ఇది రాజమౌళి ఓవర్ కాంఫిడెన్స్ కి పరాకాష్ట. సినిమా ఏమాత్రం తేడా జరిగినా కే ఎస్ రామారావుకి ఆత్మహత్య ఒక్కటే దారి, ఇక నిర్మాత దిల్ రాజు అయితే ఇన్నేళ్లు కస్టపడి సంపాదించుకున్న డబ్బులు మొత్తం పోతాయి. చూడాలి మరి ఎలా చేస్తారో.
