జాతి రత్నాలు హీరో నవీన్ పోలిశెట్టి మరియు అనుష్క శెట్టి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘మిస్ శెట్టి..మిస్టర్ పొలిశెట్టి’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘భాగమతి’ తర్వాత అనుష్క మరియు ‘జాతి రత్నాలు’ తర్వాత నవీన్ పోలిశెట్టి కలిసి చేస్తున్న చిత్రమిది. ఇద్దరు వెండితెర కనిపించి చాలా కాలమే అయ్యింది. ముఖ్యంగా అనుష్క ని వెండితెర పై చూడాలని అభిమాలు సుమారుగా నాలుగేళ్ల నుండి ఎదురు చూస్తున్నారు. చాలా రోజుల గ్యాప్ తరువాత అనుష్కతో కలిసి మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి చేయనున్నాడు.

మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ఫుల్ గా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చెయ్యాలని ప్రయత్నిస్తున్నాడు నవీన్ పోలిశెట్టి. అయితే ఈ సినిమాలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అనుష్క లాంటి స్టార్ హీరోయిన్ నవీన్ పోలిశెట్టితో నటించడమే. ఇక ఈ సినిమాలో నవీన్ కి అనుష్క కి మధ్య చాలా రొమాంటిక్ సీన్స్ ఉంటాయని ఆడియన్స్ ఆశపడుతున్నాడు. మరి నిజంగానే ఇదొక రొమాంటిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ కాబట్టి కచ్చితంగా వారిద్దరి మధ్య రొమాన్స్ ఉంటుందని భావించొచ్చు. దీనికి అనుష్క కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

స్టార్ హీరోయిన్‌తో స్క్రీన్ మీద నవీన్ రొమాన్స్ ఎలా చేస్తాడో చూడాలి. అసలయితే అనుష్క లాంటి అందగత్తె పక్కన కొంతమంది హీరోలు మాత్రమే సెట్ అవుతారు. అలాంటిది ఆ బ్యూటీ పక్కన నవీన్ స్క్రీన్ పై ఎలా కనిపిస్తాడో చూడాలి ఇక. అలాగే జాతి రత్నాలు లెవెల్లో నవీన్ తన ఖాతాలో మరో హిట్ వేసుకుంటాడో లేదో చూడాలి. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారి నిర్మిస్తుండగా, మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ వల్ల సినిమా పై ప్రేక్షకులో అంచనాలు పెరుగుతున్నాయి.