Vishwak Sen : విశ్వక్ సేన్ రీసెంట్ గా ‘గామి’ వంటి ప్రయోగాత్మక సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. రిలీజ్ కి ముందుకు ట్రైలర్ అండ్ టీజర్ తో టాక్ ఆఫ్ ది టౌన్ అయిన ఈ చిత్రం.. మూడు రోజుల్లోనే బాక్స్ ఆఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ సాదించేసి సూపర్ హిట్టుగా నిలిచింది. ప్రస్తుతం నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాలు తెచ్చిపెడుతుంది. అయితే ఈ మూవీకి మరింత ఫేమ్ వచ్చి ఉండాల్సి ఉందని పలువురు కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రీసెంట్ ప్రెస్ మీట్ లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ..

“ఈ సినిమాని ఇండస్ట్రీ పెద్దలు కూడా చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇది మన తెలుగు సినిమా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆడియన్స్ కూడా ఇంకా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇలాంటి సినిమా ఇప్పటివరకు తెలుగులో రాలేదు” అంటూ వ్యాఖ్యానించారు. ఇక ఈ కామెంట్స్‌ని, విశ్వక్ ఓల్డ్ కామెంట్స్‌తో ట్యాగ్ చేస్తూ నెటిజెన్స్ ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేసారు. గతంలో విశ్వక్.. ‘నన్ను ఎవడు లేపక్కర్లేదు. నన్ను నేనే లేపుకుంటా’ అని వ్యాఖ్యానించారు. ఆ కామెంట్స్ ని చూపిస్తూ.. అప్పుడు అలా ఇప్పుడు ఇలా అంటూ నెటిజెన్స్ విశ్వక్ ని ట్రోల్ చేయడం స్టార్ట్ చేసారు. ఇక ఈ ట్రోల్స్ పై రియాక్ట్ అవుతూ విశ్వక్ సేన్ ఓ ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ లో విశ్వక్..

“నా ముందు కామెంట్స్ గురించి మాట్లాడుతున్న వారందరికీ ఒక విషయం చెప్పదలచుకున్నాను. సినిమా రిలీజ్ కి ముందు అడిగితే లేపమని, సపోర్ట్ చేయమని. అదే సినిమా హిట్ అయ్యి ప్రాఫిట్స్ లో ఉండమని అడిగితే.. అది గుర్తించమని. నేను ఎందుకు అలా అడగాల్సి వచ్చిందంటే.. ఆ సినిమాలో నేను తప్ప మిగిలిన ప్రతి ఒక్కరు కొత్త టెక్నీషియన్. ఆ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. వారి టాలెంట్ ని గుర్తించడం కోసం చూడండి అని మాట్లాడాను” అంటూ చెప్పుకొచ్చారు. విశ్వక్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది.