Samantha : ముందుగా తన కాలేజ్ సమయంలోనే మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది సమంత. ఆ తర్వాత పలు యాడ్స్‌లో నటించింది. అదే సమయంలో తనకు ఒక తమిళ చిత్రంలో హీరోయిన్‌గా నటించే అవకాశం రావడంతో తన కెరీర్ టర్న్ అయిపోయింది. తాజాగా సమంత.. తన కెరీర్ మొదట్లో యాడ్స్ చేస్తున్న సమయంలో ఎలా ఉండేదో ఒక వీడియో వైరల్ అయ్యింది.

దీంతో సామ్.. అప్పుడెలా ఉంది, ఇప్పుడెలా ఉంది అని పోల్చి చూడడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఎంటర్‌టైన్మెంట్ వరల్డ్‌లో సమంత.. మకుటం లేని మహారాణిగా వెలిగిపోతోంది. అందంలోనే కాదు.. అభినయంలో కూడా సమంత.. తరువాతి ప్యాన్ ఇండియా స్టార్ అని ఫ్యాన్స్ ఎప్పుడో సర్టిఫికెట్ ఇచ్చారు. చివరిగా ‘ఖుషి’ చిత్రంలో నటించింది సమంత. విజయ్ దేవరకొండతో తను జతకట్టిన ‘ఖుషి’.. మంచి టాక్‌ను సాధించడంతో పాటు కలెక్షన్స్ విషయంలో కూడా పరవాలేదనిపించింది.

ఆ తర్వాత సామ్ కెరీర్ అప్డేట్ ఏంటి అని ఇంకా తెలియదు. తనకు ఉన్న మయాసిటీస్ వ్యాధికి సంబంధించిన చికిత్స కోసం విదేశాలు వెళ్తుందని, సంవత్సరం పాటు బ్రేక్ తీసుకోనుంది అని సమంత సైతం పరోక్షంగా తెలియజేసింది. ఇంతలో సమంత.. మోడలింగ్ చేస్తున్నప్పుడు నటించిన ఒక యాడ్‌కు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అప్పటినుండి ‘ఖుషి’ వరకు సమయంలో వచ్చిన మార్పుల గురించి నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.