Nayanthara : హీరోలకు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ నయనతారకు ఉంది. దీనికి తోడు నయన్‌ని తమిళ తంబీలు తలైవి, లేడీ సూపర్‌స్టార్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ప్రస్తుతం, నయనతార తన భర్త విఘ్నేష్ శివన్, పిల్లలతో సినిమాలు చేస్తూ చాలా సంతోషంగా ఉంది. ఈ సమయంలో, కొన్ని వెబ్‌సైట్‌లు ఆమె విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు రాశాయి. డైవర్స్ బాటలో మరో స్టార్ కపుల్ నయనతార విడాకులు త్వరలో వార్తల్లో నిలిచాయి.
దీనికి నిదర్శనంగా నయనతార భర్త విఘ్నేష్ శివన్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసిందని అంటున్నారు. నయనతార తన భర్త విఘ్నేష్ శివన్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసిందని షోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై నెటిజన్లు, అభిమానులు కూడా భిన్నంగా స్పందిస్తున్నారు. అయితే అది పూర్తిగా ఫేక్ న్యూస్ అని తేలింది. ఎందుకంటే నయనతార ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయింగ్ లిస్ట్ లో సెర్చ్ చేస్తే విఘ్నేష్ పేరు కనిపిస్తుంది. దీన్ని బట్టి ఏదో సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగి ఉండొచ్చని అర్థమవుతోంది.
విడాకులు తీసుకున్నారంటూ మీడియాలో వార్తలు రాయడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. వారు తమ వాదనకు మద్దతుగా నయనతార ఇన్‌స్టా స్టోరీని కూడా ఉపయోగిస్తున్నారు. నయన్ విచారకరమైన కోడ్‌ను పోస్ట్ చేయడంతో ఈ పోస్టు వైరల్ అయింది. దీంతో విక్కీతో గొడవ జరిగింది, అందుకే అన్‌ఫాలో చేసి ఈ కొటేషన్ పెట్టింది అంటూ పుకార్లు వచ్చాయి. టెక్నికల్ ఇష్యూ వల్ల పిల్లలతో హ్యాపీగా ఉన్న నయన్ కి విడాకులు రాయడం ఎంత విచిత్రం.
దీనిపై నయనతార స్పందించాలని సోషల్ మీడియాలో రాయడం మరో విచిత్రం. మరికొందరు ఛి ఆపండ్ర మేరు మనుషులేనా అంటూ సీరియస్ అవ్తున్నారు. దాదాపు ఏడేళ్ల పాటు డేటింగ్ చేసిన నయనతార-విఘ్నేష్ శివన్ 2022లో పెళ్లి చేసుకున్నారు. పెద్దల అంగీకారంతో అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. పెళ్లయినప్పటి నుంచి విక్కీ సోషల్ మీడియాలోనూ, ఇంటర్వ్యూల్లోనూ నయన్ గురించి గొప్పగా మాట్లాడేవాడు. విక్కీ లాంటి భర్త దొరకడం తన అదృష్టమని నయనతార పలు సందర్భాల్లో చెప్పింది. కాబట్టి అభిమానులు ఎక్కువ టెన్షన్ పడకుండా ఇలాంటి ఫేక్ న్యూస్ పట్టించుకోకుండా ఉంటేనే మంచిది.