Nayanthara సౌత్ ఇండియా సూపర్ స్టార్ తో సమానమైన స్టార్ స్టేటస్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో నయనతార కచ్చితంగా నెంబర్ 1 స్థానం లో ఉంటుంది. కేవలం ఈమె కోసం థియేటర్స్ కి కదిలే ఆడియన్స్ సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. ఏడాదికి ఎంతో మంది కుర్ర హీరోయిన్లు ఇండస్ట్రీ లోకి అడుగుపెడుతున్నప్పటికీ, నయనతార డిమాండ్ ఇసుమంత కూడా తగ్గలేదంటే, ఆమె రేంజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే నయనతార కొన్ని విషయాల్లో చాలా డిమాండ్ గా ఉంటుంది అని దర్శకనిర్మాతలు అంటూ ఉంటారు. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా ఆమె ప్రొమోషన్స్ లో పాల్గొనదు. ఒక సినిమాకి సంతకం చేసే ముందు ఈ షరత్తు కి ఒప్పుకుంటేనే ఆమె అగ్రిమెంట్ మీద సంతకం చేస్తుంది.
అది చిరంజీవి సినిమా అయినా, రజినీకాంత్ సినిమా అయినా, షారుఖ్ ఖాన్ సినిమా అయినా, ఎవరికైనా ఒక్కటే రూల్ ని పాటిస్తూ వచ్చేది నయనతార. షారుఖ్ తో ఆమె నటించిన జవాన్ చిత్రం ప్రొమోషన్స్ లో కూడా ఆమె పాల్గొనలేదు. అంతెందుకు తన భర్త సతీష్ విగ్నేష్ కూడా ఒక్క దర్శకుడే. అతని దర్శకత్వం లో రెండు మూడు తమిళ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కానీ ఒక్క సినిమా ప్రమోషన్ లో కూడా ఆమె పాల్గొనలేదు. అతనితో ప్రేమలో ఉన్నప్పుడు కూడా రూల్ ని విస్మరించలేదు. కానీ రీసెంట్ గా ఒక డైరెక్టర్ కోసం తాను నియమించుకున్న రూల్స్ అన్నిటిని బ్రేక్ చేసేసింది. అతను మరెవరో కాదు, పవన్ కళ్యాణ్ తో పంజా సినిమా తీసిన విష్ణు వర్ధన్ కోసం.
పూర్తి వివరాల్లోకి వెళ్తే విష్ణు వర్ధన్ రీసెంట్ గా నేసిపయ్య అనే తమిళ సినిమా తీసాడు. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలే జరగగా, ఈ ఈవెంట్ కి నయనతార ముఖ్య అతిధిగా విచ్చేసింది. భర్త సినిమాల ప్రొమోషన్స్ కి కూడా రాని నయనతార, విష్ణు వర్ధన్ సినిమాకి రావడం ఏమిటి అని అభిమానులు సైతం ఆశ్చర్యపోయారు. అందుకు ఒక కారణం కూడా ఉంది. నయనతార కెరీర్ లో మైల్ స్టోన్ గా నిల్చిపోయిన చిత్రాలలో ఒకటి బిల్లా. ఈ చిత్రానికి విష్ణువర్ధన్ దర్శకత్వం వహించాడు. తన కెరీర్ లో మర్చిపోలేని చిత్రం ఇచ్చినందుకు నయనతార కి మొదటి నుండి ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఆ అభిమానం తోనే ఆమె ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం లో పాల్గొన్నది.