Leo Movie : ప్రస్తుతం సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘లియో’ చిత్రం కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో మన అందరికీ తెలిసిందే. ‘విక్రమ్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత లోకేష్ కనకరాజ్ దర్సకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా పై అటు తమిళ ఆడియన్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారో, తెలుగు ఆడియన్స్ కూడా అదే రేంజ్ లో ఎదురు చూస్తున్నారు.
విడుదలైన మూడు పాటలలో రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ, అది అనిరుద్ రేంజ్ కాదని నెటిజెన్స్ లో ఒక అసంతృప్తి ఉంది. అలాగే ట్రైలర్ కూడా లోకేష్ సినిమా రేంజ్ లో లేదని నెటిజెన్స్ నుండి వచ్చిన అభిప్రాయం. అయినా కానీ లోకేష్ కనకరాజ్ నిరాశపర్చడు, కచ్చితంగా సినిమా మరో లెవెల్ లో ఉంటుంది అని అభిమానులు బలమైన నమ్మకం తో ఉన్నారు.
ఇదంతా పక్కన పెడితే ‘లియో’ మీద కొంతమంది దురాభిమానులు కావాలని ప్రతీ రోజు సినిమా పై నెగటివిటీ ని పెంచుతూ ఉన్నారు. విడుదల కాకముందే ఈ సినిమా ఇన్సైడ్ రిపోర్ట్స్ బాగాలేవని, విజయ్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అవ్వుదని ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియా అన్న తర్వాత ఇవన్నీ కామన్ కదా, అందులో ఏముంది అనుకోవచ్చు. కానీ దురాభిమానులలో ఇండస్ట్రీ కి సంబంధించిన వారు ఉంటే?, ఇప్పుడు లియో విషయం లో అదే జరిగింది.
విజయ్ కి డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కి మధ్య విభేదాలు ఏర్పడ్డాయని, ఈ సినిమా ఔట్పుట్ పట్ల లోకేష్ సంతృప్తి గా లేడనీ ఇలా ఎన్నో రకాల ట్వీట్స్ ట్విట్టర్ లో వచ్చాయి. ఈ ట్వీట్స్ కి నయనతార భర్త విఘ్నేష్ శివన్ లైక్స్ కొట్టాడు. ఇదే ఇప్పుడు పెద్ద చర్చలకు దారి తీసింది. ఆ తర్వాత విజయ్ ఫ్యాన్స్ మా హీరో సినిమా ఫ్లాప్ అవ్వడానికి పూజలు చెయ్యిస్తున్నావా ఏమిటి అంటూ ఆయనని ట్యాగ్ చేసి తిట్టడం ప్రారంభించారు. దీనికి విగ్నేష్ స్పందిస్తూ, ఎదో పొరపాటున లైక్ బటన్ కి చెయ్యి తగిలిందని, కావాలని లైక్ కొట్టలేదు అంటూ కవర్ చేసుకున్నాడు. కానీ అతను ఉద్దేశపూర్వకంగానే లైక్ కొట్టాడు అంటూ విజయ్ ఫ్యాన్స్ అంటున్నారు.