Nayani Pavani : బిగ్ బాస్ సీజన్ 7 ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో రికార్డు స్థాయి టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఈ సీజన్ ప్రారంభం అయ్యి ఆరు వారాలు అయ్యింది. గత వారం 5 మంది కొత్త కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా లోపలకు పంపారు. వారిలో నయని పావని ఒకరు. ఈమె ఎవ్వరూ ఊహించని విధంగా నిన్న ఎలిమినేషన్ కి గురైన సంగతి మన అందరికీ తెలిసిందే.

ఈమె ఎలిమినేషన్ హౌస్ మేట్స్ లో ఉన్న వాళ్లందరినీ చాలా ఎమోషనల్ కి గురి చేసింది. హౌస్ ని వదిలి వెళ్తున్నప్పుడు ఆమె ఏడుపుల్ని చూసి ఆడియన్స్ కూడా ఫీల్ అయ్యారు. ఏమాత్రం ఛాన్స్ ఉన్న నయని పావని కి మరో అవకాశం ఇవ్వాలంటూ బిగ్ బాస్ ని డిమాండ్ చేస్తున్నారు నెటిజెన్స్. అయితే పావని రీ ఎంట్రీ ఇవ్వడం దాదాపుగా అసాధ్యమే అని చెప్పాలి.

ఎందుకంటే ఇప్పటికే ఎలిమినేట్ అయిన శుభశ్రీ, రతికా మరియు దామిని లలో ఒకరు ఈ వారం హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇక బిగ్ బాస్ లో ఈ సీజన్ వైల్డ్ కడై డోర్ ఇక క్లోజ్ అయ్యిపోయినట్టే. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా పావని ఎలిమినేషన్ గురించి సోషల్ మీడియా లో ఒక రూమర్ జోరుగా ప్రచారం సాగుతుంది. పావని తో పాటుగా అశ్వినీ శ్రీ కి కూడా సరిసమానమైన ఓటింగ్ వచ్చిందట.

కానీ అశ్విని తో పోలిస్తే పావని రెమ్యూనరేషన్ చాలా ఎక్కువట. ఒక్క వారం ఉన్నందుకు ఆమెకి బిగ్ బాస్ టీం రెండు లక్షల రూపాయిలు రెమ్యూనరేషన్ గా ఇచ్చినట్టు తెలుస్తుంది. అందుకే ఇద్దరిలో ఒకరిని ఎలిమినేట్ చెయ్యాల్సిన సందర్భం వచ్చినప్పుడు నయనీ పావని ని ఎలిమినేట్ చేసినట్టుగా చెప్తున్నారు. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి.