Nayani Pavani : బిగ్‌బాస్ సీజన్ సెవెన్ అంటూ హోస్ట్ నాగార్జున మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. సీజన్ -7.. 2.0లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి ఐదుగురు కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. వారిలో ఒకరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నయని పావని. హౌస్ లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి ప్రతి టాస్క్ లోను 100శాతం ఇస్తూ.. అవసరమైనంత వరకే మాట్లాడుతూ మెచ్చూర్డ్ గా బిహేవ్ చేసి అందరినీ ఆకట్టుకుంది.
వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన ఐదుగురిలో ది బిస్ట్ అనిపించుకుంది. ఎంతో బాగా ఆడుతుంది అనుకునేంత లోపే ఈ అమ్మడిని హఠాత్తుగా ఎలిమినేట్ చేసేశారు. కేవలంలో ఒకే ఒక వారం తనతో ఉన్న హౌస్ మేట్స్ నయని ఎలిమినేట్ కావడంతో కన్నీటి పర్వంతం అయ్యారు. శివాజీ ఏకంగా తను బాగా ఆడుతుంది..కావాలంటే నేను వెళ్లిపోతాను తనను ఉండనివ్వండి అంటూ నాగార్జునతో అనడం ఆశ్చర్యకరం అనిపించింది.
కానీ నాగార్జున ఇది ప్రేక్షకుల డెసిషన్ మనం ఏం చేయలేమని చెప్పుకొచ్చాడు. ఇన్ని సీజన్లలో ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయితే హౌస్ మేట్స్ అందరూ ఇలా ఏడ్వడం ఇదే మొదటి సారి అన్నాడు. నువ్వు ఎలిమినేట్ అయినా.. జనం మనసులను గెలిచావంటూ నాగార్జున మెచ్చుకున్నారు. తర్వాత శోభాశెట్టిని సేవ్ చేయడానికి.. బిగ్ బాస్ నయని పావనిని ఎలిమినేట్ చేశారంటూ జనాలు ఫైర్ అవుతున్నారు.
మన తెలుగు పిల్ల నయని గేమ్ బాగా ఆడినప్పటికీ ప్రేక్షకులు తక్కువ ఓట్లు వేశారని అబద్ధం చెప్పి అన్యాయంగా బయటకు పంపించేశారని కామెంట్స్ చేస్తున్నారు. ఇక నయని పావని బిగ్ బాస్ హౌస్ కి వచ్చే ముందు వరకు తాను ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఆమె పెద్ద సెలబ్రిటీ కాకపోవడంతో రెమ్యూనరేవషన్ కూడా తనకు చాలా తక్కువే ఇచ్చారట. రోజుకు కేవలం రూ.30 వేల చొప్పున ఇచ్చారట. ఆమె హౌస్ లో వారం కూడా ఉండలేదు. కాబట్టి తనకు కేవలం రూ.1,80,000 వచ్చినట్లు తెలుస్తుంది.
ఆస్ట్రేలియా నుంచి ఆమె రావడానికి దాదాపు రూ.10 లక్షల వరకు ఖర్చు అయింది. అక్కడి నుంచి అంత ఖర్చు పెట్టుకుని వచ్చి పార్టిసిపేట్ చేస్తే తనకు తీరని అన్యాయమే జరిగింది. కేవలం ముష్టి ముప్పై వేలు ఇచ్చి ఇంటికి పంపించారు అంటూ ఫైర్ అవుతున్నారు. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన షో ఫస్ట్ డేనుంచి ఎలిమినేట్ అయ్యే వరకు ప్రతిరోజు రెమ్యునరేషన్ ను కంటెస్టెంట్లకు ఇస్తారని తెలుస్తోంది. ఇదే నిజమైతే నయని పావనీకి రూ.10 లక్షలు వరకు వచ్చే అవకాశం ఉంది.