అనుష్కతో రొమాన్స్ చేయడానికి ఇబ్బంది పడిన నవీన్ పోలిశెట్టి.. కానీ, అది బాగా నేర్చుకున్నాడుట

- Advertisement -

ఓ సినిమా సక్సెస్ అవ్వాలంటే హీరోయిన్ తో కెమిస్ట్రీ బాగుండాలని అంటున్నాడు హీరో నవీన్ పొలిశెట్టి. మరీ ముఖ్యంగా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి లాంటి సినిమాలు క్లిక్ అవ్వాలంటే, ఆ కెమిస్ట్రీ ఇంకా బాగుండాలని చెబుతున్నాడు. ఈ విషయంలో అనుష్క రూపంలో తమకు మంచి హీరోయిన్ దొరికిందని చెబుతున్నాడు. “అనుష్క హీరోయిన్ అనగానే హ్యాపీగా ఫీలయ్యా. ఆమెతో నా కాంబినేషన్ బాగుంది. మా మధ్య టైమింగ్ కుదిరేందుకు ఒకట్రెండు రోజులు పట్టింది. ఆ తర్వాత చాలా ఎంజాయ్ చేస్తూ సినిమాలో నటించాం. ట్రైలర్ లో మీరు చూసింది తక్కువే. సినిమాలో అనుష్క చేసే రచ్చను చూస్తారు. హీరో హీరోయిన్ల క్యారెక్టర్స్ కెమిస్ట్రీ మీద రన్ అయ్యే సినిమా ఇది.

స్టాండప్ కామెడీ క్యారెక్టర్ తో ఫుల్ లెంగ్త్ సినిమా తెలుగులో రాలేదు. నిజంగానే స్టాండప్ కామెడీ షోస్ కండెక్ట్ చేసి రియల్ ఆడియెన్స్ తో మా సినిమాలో సీన్స్ షూట్ చేశాం. నేను కూడా మరే సినిమా ఒప్పుకోకుండా పూర్తిగా ఈ మూవీ మీదే దృష్టి పెట్టా. రొమాంటిక్ కామెడీ మూవీస్ తో పోల్చితే మా సినిమాలో ఒక యూనిక్ పాయింట్ ఉంది. గత రెండేళ్లు ఈ ప్రాజెక్ట్ మీదే మేమంతా పనిచేశాం. సినిమాను అంతగా నమ్మాం. ఒక కథను మీ ముందుకు తీసుకువద్దామని నమ్మకంతో పనిచేశాం.”

అసలు ఈ మొత్తం ప్రాసెస్ లో సీనియర్ నటి అనుష్క నుంచి పొలిశెట్టి నేర్చుకున్న అంశాలేంటి? ఇదే ప్రశ్న ఈ హీరోకు ఎదురైంది. దీనిపై వెంటనే స్పందించాడు నవీన్. అనుష్క నుంచి కౌగిలింతలు నేర్చుకున్నానని చెబుతున్నాడు. “సెట్స్ లో అడుగుపెట్టగానే ఓ వెచ్చటి హగ్ ఇస్తుంది అనుష్క. ఎంతో అభిమానపూర్వకంగా ఇచ్చే కౌగిలింత అది. ఆవిడ నుంచి నేను కూడా అలా హగ్ ఇవ్వడం నేర్చుకున్నాను. అనుష్కలో ఉన్న మంచి క్వాలిటీస్ లో అదొకటి.” సెప్టెంబర్ 7న థియేటర్లలోకి వస్తోంది మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు మహేష్ బాబు దర్శకుడు. ఈ సినిమా తర్వాత మరే సినిమాకూ కాల్షీట్లు కేటాయించలేదు అనుష్క.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here